బాలుడి పెదాల మీద ముద్దు పెడుతున్న వీడియోపై వివాదం.. క్షమాపణలు చెప్పిన దలైలామా

వీడియో క్యాప్షన్, బాలుడి పెదాల మీద ముద్దు పెడుతున్న వీడియోపై వివాదం.. క్షమాపణలు చెప్పిన దలైలామా

బాలుడికి తాను ముద్దుపెడుతున్న వీడియో ఒకటి వివాదాస్పదం కావడంతో బౌద్ధ మత గురువు దలైలామా క్షమాపణ చెప్పారు.

దలైలామా తన నాలుకను బయటకు తీసి, నోటితో టచ్ చేస్తావా అని భారత్‌కు చెందిన ఆ బాలుడిని అడుగుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

దలైలామా మాటలు బాలుడిని, అతని కుటుంబ సభ్యులను బాధించి ఉండొచ్చని, వారికి ఆయన క్షమాపణలు చెబుతున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.

దలైలామా ఆ బాలుడి పెదాలపై ముద్దుపెడుతున్నట్టు వీడియోలో ఉంది.

"తనను కలిసిన వారిని దలైలామా అమాయకంగా, సరదాగా ఆట పట్టిస్తుంటారు. జనం సమక్షంలో, కెమెరాల ముందు కూడా ఇలా చేస్తుంటారు. తాజా ఘటనపై ఆయన విచారం వ్యక్తంచేస్తున్నారు" అని ఆయన కార్యాలయం తెలిపింది.