లాహోర్ జైల్లో మూడు రోజులున్న సింహం ఇదే. జరిమానా కట్టి దీన్ని విడిపించుకుని వెళ్లారు.

లాహోర్‌ జూలో అధికారికంగా మూడు రోజులపాటు జైల్లో ఉన్న పాకిస్తాన్‌లోని మొట్టమొదటి సింహం ఇదే.

''మరియం నవాజ్ షరీఫ్‌తో కలిసి పీడీఎం ర్యాలీ నిర్వహించినపుడు ఇది ఆ ర్యాలీలో ఉంది. దాంతో దీనికి ఆహారం తినిపించినందుకు మరియంపై మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత ర్యాలీలో ఉన్నందుకు ఈ సింహంపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంతో వైల్డ్ లైఫ్ చట్టం కింద లక్ష రూపాయల జరిమానా విధించారు. దీన్ని లాహోర్ జూలో మూడు రోజులు ఉంచారు. తర్వాత నేను దీన్ని కోర్టు ద్వారా విడిపించుకున్నాను. దానికి లక్ష రూపాయల ఫైన్ కూడా కట్టాను'' అని సింహం యజమాని సయ్యద్ ఇందాద్ హైదర్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)