You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యూబా: రికార్డు స్థాయిలో దేశంలో వదిలి వెళుతున్న యువత
1962 ఫిబ్రవరి 7న క్యూబా మీద ఆంక్షలను పొడిగించడమే కాకుండా ఆ దేశం నుంచి అన్ని రకాల ఎగుమతులపై నిషేధం విధించింది అమెరికా.
ప్రపంచంలో సుదీర్ఘకాలంగా నడుస్తోన్న అతిపెద్ద ఆర్థిక ఆంక్షలు ఇవే. దాంతో ఈ ఆంక్షల ప్రభావం క్యూబా వాణిజ్యం మొదలుకొని వ్యవసాయం, పర్యటకం సహా క్యూబా ప్రజల జీవితాలపైనా తీవ్రంగా పడింది.
ప్రచ్ఛన యుద్ద కాలం నుంచి దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొటోంది క్యూబా.
క్యూబా సమస్యలకు ఆంక్షలే కారణమని క్యూబా ప్రభుత్వం చెబుతుంటే - కమ్యూనిస్ట్ ఆర్థిక విధానాలే కారణమని విమర్శకులంటున్నారు.
ఉద్యోగ అవకాశాల కోసం రికార్డు స్థాయిలో దేశాన్ని వదిలి వెళుతున్నారు క్యూబా యువకులు.
హవానా నుంచి బీబీసీ ప్రతినిధి విల్ గ్రాంట్ అందిస్తోన్న కథనం..