బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2 జీవిత ప్రస్థానం

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2 జీవిత కథ

బ్రిటన్‌కు 70 సంవత్సరాలపాటు రాణిగా వ్యవహరించిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు.

ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలియగానే కుటుంబ సభ్యులు గురువారం బల్మోర్ క్యాసిల్ చేరుకున్నారు.

1952లో సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్ ఎలిజబెత్-2 అనేక సామాజిక మార్పులకు సాక్షిగా నిలిచారు.

రాణి మరణించడంతో ఆమె కుమారుడు మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ వారసుడిగా పదవీ బాధ్యతలు చేపడతారు.

''రాణి ఈ మధ్యాహ్నం బల్మోరల్ క్యాసిల్‌లో ప్రశాంతంగా కన్నుమూశారు'' అని బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.