హాంగ్ కాంగ్‌కు నిజమైన ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నామన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

వీడియో క్యాప్షన్, హాంగ్ కాంగ్‌కు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించింది చైనానే అని వ్యాఖ్య

హాంగ్ కాంగ్‌లో బ్రిటిష్ వలస పాలన అంతమై ఇరవయ్యైదేళ్లు నిండిన సందర్భంగా జరిగిన వేడుకల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పాల్గొన్నారు.

గత రెండేళ్లలో జిన్‌పింగ్‌కు చైనా మెయిన్‌ల్యాండ్‌కు బయట ఇది మొదటి పర్యటన. హాంగ్ కాంగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు షి జిన్‌పింగ్.

మాజీ భద్రతా చీఫ్ జాన్ లీని... బీజింగ్‌కు బలమైన మద్దతుదారుగా భావిస్తారు. ఆయన క్యారీ లామ్ స్థానాన్ని చేపడతారు. ఈ పదవికి పోటీపడ్డ ఒకే ఒక్క అభ్యర్థి లీ.

చైనా అనుకూల ఎలక్షన్ కమిటీ ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది.

అయితే, దీనిపై చాలా మంది హాంగ్ కాంగ్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలను ఎంపిక చేసుకోవడంలో మరింత ప్రజాస్వామిక ప్రక్రియ అవసరమని వారన్నారు.

ఈ వేడుకల్లో ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ పాల్గొంటూ ఉండడంతో... హాంగ్ కాంగ్‌లో భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు.

ఈ సందర్భంగా ఎలాంటి నిరసనలకూ పూనుకోవద్దని ఉద్యమకారులను హెచ్చరించారు.

ప్రజాస్వామ్య అనుకూల బృందాలు ప్రతి ఏటా నిర్వహించే '1st July rally' కూడా ఈసారి జరగలేదు.