ఈ రోడ్డుపై వెళుతుంటే నరకానికి వెళుతున్నట్లు ఉందంటున్నారు ప్రయాణికులు. ఇంత చెత్త రహదారి ఎక్కడుంది

బిహార్ లోని మధుబని గుండా వెళ్లే నేషనల్ హైవే నంబర్ 227ఎల్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

ఈ రోడ్డు పరమ చెత్తగా ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి రోడ్డు మధుబని జిల్లాలోనే కాదు

బిహార్ లో ఎక్కడా లేదని స్థానికులు అంటున్నారు. ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటే నరకంలా ఉందని వారు అంటున్నారు.

రోడ్డు వేస్తామని మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెబుతునే ఉందని, కానీ అది నిజం కావడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)