అఫ్గానిస్తాన్: పాడై పోయిన రొట్టె ముక్కలు తిని బతుకుతున్న జనం

ముక్కిపోయిన రొట్టె ముక్కల్ని కూడా కొనుక్కునేందుకు జనం ఎగబడుతున్నారంటే అప్గనిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

సాధారణ ప్రజల రోజూ వారి ఆదాయం మూడోవంతుకు పడిపోయింది.

10 లక్షల మందికి పైగా చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మహిళల విషయంలో తాలిబన్ల వ్యవహార శైలి కారణంగా పాశ్చాత్య దేశాలు అప్గనిస్తాన్‌పై చిన్న చూపు చూస్తున్నాయి.

ఫలితంగా ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకడం గగనమైపోతోంది.

బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మాణీ అప్గన్ రాజధాని కబూల్ నుంచి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)