‘ఖార్కీవ్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది’ - ఆమ్నెస్టీ ఆరోపణ

ఖార్కీవ్‌లో రష్యా సేనలు విచక్షణారిహతంగా బాంబింగ్ చెయ్యడంతో వందల మంది పౌరులు చనిపోయారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది.

అంతర్జాతీయంగా నిషేధించిన క్లస్టర్ బాంబులను, మందు పాతరలను రష్యా సైన్యం ఇప్పటికీ ఉపయోగిస్తోందని అమ్నెస్టీ ఆరోపించింది.

ఇలాంటి ఆయుధాలను ఉపయోగించడం అంటే అది ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేని తనమనీ, యుద్ధ నేరమనీ పేర్కొంది అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ.

అయితే ఈ ఆరోపణలను ఖండిస్తున్న మాస్కో నాయకత్వం.. తాము సైనిక లక్ష్యాల మీద మాత్రమే దాడులు చేస్తున్నామని చెబుతోంది.

ఖార్కీవ్ నుంచి వీర్ డేవిస్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)