You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘బెల్లి డాన్స్’: ఈ పదం నాకు అస్సలు నచ్చదు
‘‘బెల్లి డాన్స్ అనే పదం నాకు అస్సలు నచ్చదు. దీన్ని ఈజిప్షియన్ డాన్స్ అనడం బెటర్. ఇది ఇక్కడి సంస్కృతికి ప్రతిరూపం. దీన్ని బలాడీ అని, ఈజిప్షియన్ డాన్స్ అనీ డాన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తుంటాం. బలాడి అంటే నా దేశం అని అర్ధం’’.
అమీ సుల్తాన్ ఒక శిక్షణ పొందిన బ్యాలే డాన్సర్. ఈ డాన్స్ పట్ల సామాజికంగా ఒక అపోహ ఉందంటారు అమీ సుల్తాన్.
‘‘అంతా చూసి సంతోషిస్తారు. కానీ మహిళలు. ఈ డాన్స్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు.
పితృస్వామ్య వ్యవస్థలో మహిళలను కేవలం ఇంటికే పరిమితం కావాలని అంటారు.
బ్యాలే డాన్సును ఇక్కడి ప్రజలు పెద్ద ప్రమాదంగా భావించరు. ఎందుకంటే ఇది యూరప్ నుంచి వచ్చిన సంస్కృతి.
ఈ వలస సంస్కృతి మాయలో పడిన కొందరు అసలైన ఈజిప్టు కల్చర్‌ను చిన్నచూపు చూస్తారు.
పైగా ఈ డ్యాన్స్‌కు సెక్స్ అప్పీల్‌ను కూడా జత చేశారు. ఎందుకంటే పబ్బులు, బార్లలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు ఈ డాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది. ఇలాంటి చోట్ల మహిళలే డాన్స్ చేయాలన్న వాదన ఉంటుంది.
దీనితోపాటు ఆల్కహాల్ తీసుకునే మగవాళ్లు ఎక్కువమంది ఉంటారు. ఈ డాన్స్ చేసే మహిళల మీద అనేక రూపాలలో లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు’’.
ఈ ఈజిప్ట్ డాన్స్‌కు యునెస్కో వారసత్వ సంపద హోదా కోసం అమీ సుల్తాన్, ఆమె బృందం ప్రయత్నిస్తున్నారు.
‘‘దీనిని జాతీయ సంపదగా గుర్తింపుకు దరఖాస్తు కోసం మేం ఇప్పుడు నిధులు సేకరించే పనిలో ఉన్నాం.
ఇటీవల నేను నా స్నేహితుడితో ఈ విషయం చర్చించాను. కానీ, అతను నా ప్రయత్నం ఫలితం ఇవ్వదని తేల్చేశాడు.
నేనొక డ్యాన్సర్ కావడం వల్ల నా ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరని అతను అభిప్రాయపడ్డాడు.
ఆకట్టుకునే రూపం, డాన్స్‌లో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని.. నువ్వు ఆ పనిని సాధించలేవని
నా మిత్రుడు అన్నాడు. ఈ డాన్స్ విషయంలో వాస్తవికతకు అతని మాటలు ప్రతిరూపం’’.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)