చలికాలం మామిడి, జనవరిలో దిగుబడి

పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌లోని లోద్రన్‌ జిల్లాలో ఓ రైతు తన పొలంలో పది పన్నెండు మామిడి చెట్లను నాటారు. అవి చలికాలంలో కాయలు కాస్తున్నాయి.

ఈ మామిడి జనవరిలో కాపుకొస్తుంది. ఈ చలికాలం మామిడి పేరు బారా మాసి.

‘‘వీటి రంగు, రుచి, వాసన జూన్, జూలైల్లో పండే పళ్లలాగే ఉంటాయి. ఇది మామిడిపళ్ల సీజన్ కాదు. కానీ ఈ పళ్లను పాకిస్తాన్‌లోని మిత్రులందరికీ ఇస్తాను. వారికి చూపిస్తాను’’ అని దీన్ని పండిస్తున్న రైతు సయ్యద్ జాఫర్‌ గిలానీ అంటున్నారు.

‘‘మా నాన్న 10-15 ఏళ్లుగా ఈ చెట్లను పెంచి పోషించారు. ఇప్పుడు ఇవి బాగా కాస్తున్నాయి. మేం కూడా వీటిపై కేర్ తీసుకుంటున్నాం. వీటిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాం. వీటికి కమర్షియల్ విలువ తీసుకురావాలని చూస్తున్నాం. ఈ పళ్లకు మార్కెటింగ్ పెరిగితే రైతులు వీటిని ఎక్కువగా పెంచడానికి మొగ్గుచూపుతారు. ఏదైనా సరే.. మార్కెటింగ్ జరగాల్సిందే. మార్కెట్ లేకపోతే ఏమీ లేదు’’ అన్నారాయన.

పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు సింధ్‌ రాష్ట్రంలో కూడా ఈ రకం మామిడి కనిపిస్తుందని ఫైసలాబాద్‌ రిసెర్చ్‌ సెంటర్‌ మాజీ అధికారి డాక్టర్‌ జుల్ఫికర్‌ అన్నారు.ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)