You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెల్‌నెస్ బ్రాస్లెట్‌ల నుంచి రేడియేషన్ వెలువడుతోందా
5జీ మొబైల్ నెట్‌వర్కుల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పుకుంటున్న నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు, ఇతర ఉపకరణాల్లో రేడియోధార్మికత ఉన్నట్లు తేలింది.
ఈ మేరకు నెదర్లాండ్‌కు చెందిన న్యూక్లియర్ సేఫ్టీ అండ్ రేడియేషన్ ప్రొటెక్షన్ - ఏఎన్‌వీఎస్ ఒక హెచ్చరిక జారీ చేసింది.
10 ప్రొడక్టుల్లో ఇలాంటి హానికారక రేడియేషన్ ఉన్నట్లు స్పష్టం చేసింది. అలాంటి ఉత్పత్తులను ఉపయోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే హాని జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
5జీ నెట్‌వర్కులు ఆరోగ్యానికి హానికరమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఎన్‌వీఎస్ తేల్చి చెప్పింది.
5జీ మొబైల్ నెట్‌వర్కులు సురక్షితమని, వాటికి, ప్రస్తుతం వాడుతున్న 3జీ, 4జీ సిగ్నల్స్‌కు ప్రాథమికంగా పెద్దగా తేడా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
మొబైల్ నెట్‌వర్కులు 'నాన్ ఆయానైజింగ్ రేడియో వేవ్స్'ను ఉపయోగించుకుంటాయి. డీఎన్‌ఏకు అవి హాని కలిగించవు.
అయినప్పటికీ ట్రాన్స్‌మిటర్లతో ప్రమాదం ఉందంటూ కొందరు తరచూ ఆరోపణలు చేస్తున్నారు.
రేడియోధార్మికత ఉన్నట్లు ఏఎన్‌వీఎస్ గుర్తించిన వాటిలో ఎనర్జీ ఆర్మోర్, స్లీపింగ్ మాస్క్, బ్రాస్లెట్, నెక్లెస్‌లు ఉన్నాయి.
చిన్నారుల కోసం మాగ్నటిక్స్ బ్రాండ్ తీసుకొచ్చిన వెల్‌నెస్ బ్రాస్లెట్ నుంచి కూడా రేడియేషన్ వెలువడుతోందని తేలింది.
"ఎట్టిపరిస్థితుల్లో వాటిని పెట్టుకోకండి. ఎలా తిరిగిచ్చేయాలో చెప్పే వరకు వాటిని ఒక సురక్షితమైన ప్రాంతంలో పెట్టండి" అని ఏఎన్‌వీఎస్ ఒక ప్రకటనలో కోరింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)