‘పాప ఏడుస్తుంటే, నాకు చెప్పడానికి నాపైన రాళ్లు విసిరేవారు’

''ఒంటరిగా జీవించే ఒక బధిర మహిళ చిన్నారిని పెంచడం చాలా కష్టం. నేను పాపకు జన్మనిచ్చినప్పుడు నాతో ఎవరూ లేరు అంటారు" కాథరిన్ కెన్యా.

"నేనొక ఒంటరి తల్లిని. అనాథను కూడా. నా కూతురు ఏడుస్తుంటే నాకు తెలిసేది కాదు'' అని చెబుతున్నారు.

కాథరీన్ పోస్ట్‌పార్టం డిప్రెషన్‌కు గురయ్యారు. ఇది కొత్తగా తల్లులైన వారిలో ఏర్పడే ఒక మానసిక సమస్య.

ఆ సమయంలో తన చిన్నారిని ఎలా చూసుకోవాలా అని ఆమె తల్లడిల్లారు.

పాప ఆకలితో ఏడుస్తుంటే ఆమెకు వినిపించేది కాదు, దాంతో పక్కింటి వారు అది చెప్పడానికి ఆమె పైన రాళ్లు విసిరేవారు.

చెవులు వినిపించకపోవడం వల్ల తను ఎదుర్కున్న అనుభవాలను క్యాథరిన్ కెన్యా చెవులు బీబీసీతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)