You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భలే ఐడియా.. గాలిపటాలతో విద్యుత్ ఉత్పతి.. సరికొత్త DIY టెక్నాలజీ ఆవిష్కరించిన స్కాట్లాండ్ వాసి
గాలి పటాలతో విద్యుత్‌ను ఉత్పతి చేయొచ్చా...? స్కాట్లాండ్‌లోని ఒక వ్యక్తికి ఈ ఆలోచన వచ్చింది.
రావడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టారు కూడా. గాలి మరల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నప్పుడు గాలి పటాల ద్వారా ఎందుకు తయారు చేయకూడదని ప్రశ్నించుకున్న ఆయన ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆవిష్కరించారు.
పదేళ్లపాటు దీని కోసం పని చేసిన ఆయన, ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుకే విద్యుత్‌ను అందించొచ్చని చెబుతున్నారు.
ఇదొక ప్రోటో టైప్ విండ్ టర్బైన్. రాడ్ కంపెనీ పేరు విండ్‌స్వెప్ట్ అండ్ ఇంటరెస్టింగ్.
గుండ్రంగా తిరుగుతున్న గాలి పటం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని రాడ్ చెబుతున్నారు.
స్టాటిక్ టర్బైన్స్‌తో పోలిస్తే ఫ్లయింగ్ టర్బైన్ టెక్నాలజీతో చవకగా పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని ఈ స్కాట్లాండ్ ఆవిష్కర్త అంటున్నారు.
‘‘ఎగురుతున్న గాలి పటంలా ఉంటుంది ఫ్లయింగ్ టర్బైన్స్ పని తీరు. గాలి పటాలు తిరుగుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్‌గా మారుస్తుంది. ఇది చూడటానికి చాలా బాగుందని చాలా మంది అన్నారు.’’
ఫ్లయింగ్ టర్బైన్స్‌తో విద్యుత్ వాహనాన్ని చార్జ్ చేయడమే కాకుండా కెటిల్‌లో నీటిని కూడా కాగ పెట్టారు రాడ్.
‘‘ఆకాశంలో చాలా ఎత్తుకు గాలి పటాలు ఎగరగలవు కాబట్టి మనం తక్కువ ఖర్చులో ఎక్కువ విద్యుత్‌ను తయారు చేయొచ్చు. ఇందుకు చాలా తేలికైన మెటీరియల్స్ వాడాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో చాలా తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి.’’
ఇంట్లో దొరికే వస్తువులతో తొలి ప్రోటో టైప్‌ను తన ఇంట్లోనే రూపొందించారు రాడ్.
‘‘ఒక మిత్రుని ఇంట్లో కూర్చొని ఉండగా నాకు ఈ ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచనలకు అక్షరూపం ఇవ్వాలనిపించింది. మొత్తానికి ఎన్నో ప్రయత్నాల తరువాత దీన్ని రూపొందించా. విడి భాగాలను కుట్టడం, అంటించడం, జాయింట్ చేయడం వంటి పనులు అనేకం ఉంటాయి. ఇది చాలా బేసిక్ వెర్షన్ మాత్రమే.’’
గాలి పటాలు కూడా ఒకరంగా గాలి మరల వంటివే. వేగంగా వీచే గాలి వల్ల విండ్ టర్బైన్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలా 10 కిలోమీటర్ల ఎత్తులోనూ గాలి పటాలు విద్యుత్‌ను జనరేట్ చేయగలవు.
ఇవి నిరంతరం తిరుగుతూ ఉంటే ఒక ఇంటికి సరిపడే విద్యుత్ జనరేట్ అవుతుందని చెబుతున్న రాడ్, రానున్న రోజుల్లో మరింత అడ్వాన్స్‌డ్ డిజైన్స్ వల్ల ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని ఆశిస్తున్నారు.
‘‘ఈ టెక్నాలజీ ద్వారా అనేక రంగాల విద్యుత్ అవసరాలు తీరుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, చేపలు పట్టుకునే పడవలు, ఫ్యాక్టరీలు ఇలా అనేక చోట్ల వీటిని వినియోగించుకోవచ్చు.’’
ఇవి కూడా చదవండి:
- ‘హసన్ అలీ రా ఏజెంట్, భార్య భారతీయురాలు.. కాబట్టే క్యాచ్ వదిలేశాడు’ - విపరీతంగా ట్రోల్ చేస్తున్న పాకిస్తానీయులు
- ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ మిస్సింగ్.. ఈ ఐపీఎస్ అధికారి ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకట్లేదు?
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- చైనా: చరిత్రాత్మక తీర్మానంతో తన హోదాను సుస్థిరం చేసుకున్న షీ జిన్‌పింగ్
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?
- వరదలొస్తే నీటిని పీల్చేసుకునే నగరాలు.. స్పాంజ్ సిటీలను రూపొందిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)