అఫ్గానిస్తాన్: భారత్‌కు వచ్చిన వారిలో పాలు తాగే శిశువు, వృద్ధులు కూడా ఉన్నారు - ఫోటోఫీచర్

కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను రెండు విమానాల్లో ఆదివారం దిల్లీకి తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన వారిలో భారతీయులతోపాటు అఫ్గానీ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడ చిక్కుకున్న మరికొందరిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం ఆదివారం 168 మందిని కాబుల్ నుంచి దిల్లీలోని హిండన్ వైమానిక స్థావరానికి తీసుకొచ్చింది.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, ఈ విమానంలో 107 మంది భారతీయులు ఉన్నారు. వీరితోపాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఈ విమానంలో దిల్లీకి వచ్చారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, సీ-17తోపాటు కాబుల్ నుంచి దుషాంబే మీదుగా మరో విమానం కూడా దిల్లీకి చేరుకుంది.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానంలో 87 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, దుషాంబే మీదుగా దిల్లీకి వచ్చిన విమానంలో ఇద్దరు నేపాల్ పౌరులు కూడా ఉన్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్న వారిలో పాలు తాగే శిశువు, వృద్ధులు కూడా ఉన్నారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్న అందరికీ కోవిడ్-19 ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేశారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, మరోవైపు 135 మందితో మరో విమానం కూడా దోహా మీదుగా భారత్ వస్తుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, ‘‘135 మంది భారతీయులతో కూడిన విమానం కాబుల్ నుంచి దోహాకు వచ్చింది. ఆదివారం రాత్రి వీరిని భారత్‌కు పంపిస్తాం’’అని దోహాలోని భారత దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, కాబుల్‌లో చిక్కుకున్న వారికి దౌత్య పరమైన, రవాణా సదుపాయాలు అందేలా చూసేందుకు కృషి చేస్తున్నామని దోహాలోని భారత దౌత్య కార్యాలయం వివరించింది.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, ఈ విషయంలో సాయం అందిస్తున్నందుకు ఖతర్‌కు భారత దౌత్య కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, ఆదివారం మొత్తంగా 390 మంది కాబుల్ నుంచి భారత్‌కు చేరుకోబోతున్నారు.
అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, వీరిలో 168 మంది నేరుగా కాబుల్ నుంచి భారత్ వచ్చారు. మరో 87 మంది దుషాంబే మీదుగా వచ్చారు. మిగతా 135 మంది దోహా మీదుగా రాబోతున్నారు.