టోక్యో ఒలింపిక్స్‌: భారత పురుషుల హాకీ జట్టు చరిత్రాత్మక విజయం సాధించిన వేళ :ఫోటో ఫీచర్

టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. హాకీలో భారత్ ఒలింపిక్ పతకాన్ని సాధించడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి.

భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తైమూర్ ఒరూజ్ కొట్టిన తొలి గోల్‌తో భారత్‌పై జర్మనీ మొదట లీడ్‌లోకి వెళ్లింది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రెండో క్వార్టర్‌లో అద్భుతమైన రివర్స్‌ ఫ్లిక్‌తో భారత్‌కు సిమ్రాన్‌జీత్ సింగ్ గోల్ తెచ్చిపెట్టారు. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయ్యింది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రెండో క్వార్టర్‌లో భారత్ స్కోర్‌ను సమం చేసిన కాసేపటికి జర్మనీ మరో రెండు గోల్స్‌ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆ తర్వాత సిమ్రాన్‌జీత్ సింగ్, హార్ధిక్ సింగ్.. భారత్‌కు రెండు గోల్స్ కొట్టారు. దీంతో రెండు జట్ల స్కోర్ మళ్లీ సమం అయ్యింది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మూడో క్వార్టర్ ప్రారంభంలో భారత్‌కు పెనాల్టీ స్క్రోక్ వచ్చింది. దీంతో రూపీందర్ పాల్ సింగ్ ఒక పాయింట్ తెచ్చిపెట్టాడు. ఫలితంగా జర్మనీపై 4-3తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మూడో క్వార్టర్‌లో సిమ్రాన్‌జీత్ మరో గోల్ కొట్టడంతో భారత్ స్కోర్ 5కు పెరిగింది. చివరగా మూడో క్వార్టర్ ముగిసేనాటికి జర్మనీపై భారత్ స్పష్టమైన ఆధిక్యం (5-3)లో ఉంది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాలుగో క్వార్టర్ మొదలవుతూనే జర్మనీకి పెనాల్టీ పాయింట్ వచ్చింది. దీంతో జర్మనీ పాయింట్ల సంఖ్య 4కు పెరిగింది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాలుగో క్వార్టర్ చివరి నిమిషంలోనూ జర్మనీకి పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చింది. అయితే దీన్ని గోల్‌గా మార్చుకోవడంలో ఆ జట్టు విఫలమైంది.
భారత పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ ఒలింపిక్స్‌లో గోల్‌కీపర్ శ్రీజేశ్‌పై మొదట్నుంచీ ప్రశంసలు కురుస్తున్నాయి. జర్మనీపై మ్యాచ్‌లోనూ ఆయన అద్భుతంగా ఆడారు.