అమ్మాయిల కోసం స్కూళ్లలోనే రోబోటిక్స్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఘనా
ఘనాలో సైన్స్, రోబోటిక్స్ అబ్బాయిలకు మాత్రమే అన్న అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోబోటిక్స్ రంగంలో మహిళల ప్రాధాన్యం పెంచేందుకు పాఠశాలల్లోనే రోబోటిక్స్ సెంటర్లు ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలో భవిష్యత్ ఐటీ ముఖచిత్రాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది.