శృంగార జీవితంపై కరోనావైరస్ ఎలాంటి ప్రభావం చూపింది?

కరోనా లాక్‌డౌన్ వల్ల దంపతులు ఒకే ఇంట్లో ఎక్కువ సేపు గడిపే అవకాశం దొరికింది. ఇది మొదట్లో సంతోషంగా ఉన్నా, రానురానూ పరిస్థితిలో మార్పు వచ్చిందంటున్నారు పరిశోధకులు. 2020లో భారత్, అమెరికా, ఇటలీ, టర్కీల్లో చేసిన పరిశోధనల్లో శృంగార జీవితంపై కోవిడ్ 19 చాలా ప్రభావం చూపినట్లు తేలింది.