ప్రిన్స్ ఫిలిప్‌: బలమైన వ్యక్తిత్వం.. నిబద్ధతకు మారుపేరు

వీడియో క్యాప్షన్, ప్రిన్స్ ఫిలిప్‌: డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా జీవన ప్రస్థానం

గ్రీస్‌కు చెందిన ప్రిన్స్ ఫిలిప్ 10 జూన్, 1921లో కోర్ఫు ద్వీపంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రిన్స్ ఆండ్రూ, హెల్లెనెస్ రాజైన మొదటి కింగ్ జార్జ్ చిన్న కుమారుడు. ఆయన తల్లి ప్రిన్సెస్ అలైస్, బాటెన్‌బర్గ్ ప్రిన్స్ లూయిస్ చిన్న కుమార్తె మరియు ఎర్ల్ మౌంట్‌బాటెన్ ఆఫ్ బర్మాకు సోదరి.

1922లో తిరుగుబాటును విచారించిన కోర్టు ఆయన తండ్రిని గ్రీస్ నుంచి బహిష్కరించింది.

తండ్రి బంధువైన ఐదవ జార్జి రాజు పంపిన బ్రిటిష్ యుద్ధనౌక ఆ కుటుంబాన్ని ఫ్రాన్స్‌కు తీసుకెళ్లింది. ఆ ప్రయాణంలో చిన్నవాడైన ఫిలిప్ చాలా రోజుల పాటు ఒక బత్తాయి బాక్స్‌లతో చేసిన తొట్టిలో గడిపారు.

పిల్లలందరిలో ఫిలిప్ ఆఖరివాడు. ఫిలిప్ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో ఆయనొక్కడే మగ పిల్లవాడు. అక్కలందరి మధ్యా ఆయన బాల్యం సంతోషంగా గడిచిపోయింది.

ప్రిన్స్ ఫిలిప్ తన విద్యాభ్యాసాన్ని ఫ్రాన్స్‌లో ప్రారంభించినా, ఏడేళ్ల వయసులో ఆయన మౌంట్‌బాటెన్ బంధువులతో కలిసి జీవించేందుకు ఇంగ్లండ్‌కు తరలివెళ్లారు. అక్కడ సర్రేలో చదువు కొనసాగించారు.

అయితే అప్పటికే ఆయన తల్లికి స్క్రిజోఫ్రెనియా ఉన్నట్లు తేలడంతో ఆమెను మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అందువల్ల ప్రిన్స్ ఫిలిప్‌కు తల్లితో చాలా తక్కువ సంబంధాలుండేవి.

1933లో ఆయనను చదువు కొరకు దక్షిణ జర్మనీలోని శూలస్లాస్ సాలెం అనే ప్రదేశానికి పంపారు. దాన్ని ప్రముఖ విద్యావేత్త అయిన కర్ట్ హాన్ నిర్వహించేవారు. అయితే యూదుడైన హాన్ నాజీలకు భయపడి స్కాట్లండ్‌కు పారిపోయి అక్కడ గార్డన్‌స్టౌన్ పాఠశాలను ప్రారంభించారు. దాంతో ప్రిన్స్ ఫిలిప్ తిరిగి అక్కడ చేరారు.

మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)