ఇంటికి కన్నమేసిన దొంగే ఫ్రెండుగా మారితే

వీడియో క్యాప్షన్, ఇంటికి కన్నమేసిన దొంగే ఫ్రెండుగా మారితే

మీ ఇంటికి కన్నం వేసి దొంగతనం చేసిన వాడే తర్వాత మీకు స్నేహితుడైతే ఎలా ఉంటుంది? ఉత్తర ఇంగ్లండ్లో అధికారులు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమమిది.

ఉత్తర ఇంగ్లండ్లోని బర్మింగ్‌హాంలో ఓ దంపతులకు.. వాళ్ల ఇంటికి కన్నం వేసి దొంగతనం చేసిన దొంగకు మధ్య చిత్రంగా స్నేహం కుదిరింది.

నేరస్థుల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా, వాళ్లు తిరిగి నేరాలు చేయకూడదనే ఉద్దేశంతో, ఈ దొంగను గతంలో తాను చేసిన దొంగతనానికి బాధితులైన దంపతులతో కలిపింది ఒక రిస్టోరేటివ్ జస్టిస్ ప్రాగ్రాం.

ఈ వినూత్న కార్యక్రమం ఎలా ఉందో తెల్సుకునేందుకు బీబీసీ బృందం వాళ్లను కలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)