ఆస్ట్రేలియా: గత 50 సంవత్సరాల్లో ఇలాంటి వరదలు చూడలేదు!

వీడియో క్యాప్షన్, ఆస్ట్రేలియా: గత 50 సంవత్సరాల్లో ఇలాంటి వరదలు చూడలేదు!

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిడ్నీలోని నదులు, వంతెనలన్నీ నీట మునిగాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వరద ఉధృతికి ఓ త్రిబుల్ బెడ్ రూం కాటేజ్‌ కూడా కొట్టుకుపోయింది.

వరదలలో చిక్కుకున్న పశువులను కాపాడేందుకు శ్రమిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది.

ఓ బృందం దాదాపు 20 కుక్కలను పడవల సాయంతో కాపాడగలిగింది.

సిడ్నీకి వాయవ్య దిశలో ఉన్న విండ్సర్ పట్టణ ప్రజలకు వరదలు కొత్త కాకపోయినా ఇలాంటివి మాత్రం వారు కూడా ఎప్పుడూ చూడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)