కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా

చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ మార్చి 13వ తేదీ నాటికి 118 దేశాలకు వ్యాపించింది. 1,25,000 మంది కోవిడ్-19 వ్యాధిబారిన పడ్డారు. 4,600 మంది చనిపోయారు.

ఇది అంటురోగమని, ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) దీనిని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పదేపదే ముఖాన్ని తాకొద్దని, అపరిశుభ్ర చేతులతో వస్తువులను కానీ, ఇతర వ్యక్తుల్ని కానీ తాకొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 20 సెకండ్లలో మీ చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)