వెయ్యి కిలోమీటర్ల దూరం విమానాన్ని వెంబడించిన పక్షులు
బాల్డ్ ఐబస్.. ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షుల్లో ఒకటి. ఇవి దిశలను గుర్తించే జ్ఞానాన్ని కోల్పోయాయి. దీంతో ఒక బృందం వాటిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడానికి సృజనాత్మక ఆలోచనతో ముందుకు వచ్చింది.
వాటిలోని ఒక పెద్ద పక్షిని తేలికపాటి విమానంలో ఎక్కించుకొని మిగిలిన పక్షులు దాన్ని అనుసరించేలా చేసింది. ఇలా దాదాపు వెయ్యి కిలోమీటర్లు, రెండు పర్వత శ్రేణులు దాటి ప్రయాణించి పక్షులన్నింటిని కాపాడింది.
మధ్య యూరప్‌లో ఒకప్పుడు పూర్తిగా కనుమరుగైన ఈ పక్షలు వీరి కృషి ఫలితంగా ఇప్పుడు సందడి చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)