దక్షిణ చైనా సముద్రం మీద ముదురుతున్న వివాదం

వీడియో క్యాప్షన్, అవి చైనా నిర్మించిన కృత్రిమ దీవులు

దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం చైనా తహతహలాడుతోంది. పొరుగు దేశాలు, మిత్ర పక్షాలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సముద్రంలో కృత్రిమంగా ద్వీపాలను నిర్మిస్తూ వాటిని మిలటరీ స్థావరాలుగా మారుస్తోంది. ఈ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. అయితే, అమెరికా మాత్రం చైనా ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెబుతోంది.