You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Archive: ఇది మామూలు గొరిల్లా కాదు
కోకో- ఇది మామూలు గొరిల్లా కాదు. మనం ఇచ్చే వెయ్యికి పైగా సంకేతాలను అర్థం చేసుకోగలదు. గత నెలలో కాలిఫోర్నియాలో చనిపోయే నాటికి దాని వయసు 46 ఏళ్లు. ఇది 1985లో బిబిసి తనను కలిసినప్పటి కథనం. ఈ గొరిల్లాకు ఒక పిల్లి కూన కూడా నేస్తంగా ఉండేది. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా?
చేతితో ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడంలో తనకు తానే సాటి. అలానే ఇతర జాతి ప్రాణుల సంరక్షణ కూడా బాగా తెలుసు. తన తెలివి, మృదు స్వభావంతో లక్షలాది మంది హృదయాలలో చోటు సంపాదించుకుంది.
ఇక్కడ కోకో ఒక పిల్లికూనతో ఆడుకోవడం మనం చూస్తున్నాం. ఆ పిల్లిని దత్తత తీసుకుంది కోకో. అంతే కాదు. ఈ పిల్లి పిల్లకు ఓ పేరు కూడా పెట్టింది. ఆ పేరేంటో తెలుసా? లిప్ స్టిక్. ఈ పేరు పెట్టడానికి కారణం, పిల్లి పెదాలు పింక్‌గా ఉండటమే. కోకో తన జీవితంలో ఇలాంటి చాలా ప్రాణులను చేరదీసింది. వాటిలో ముఖ్యమైనవి పిల్లులు.
అయితే కోకో ప్రఖ్యాతి గడించడానికి ఇదొక్కటే కారణం కాదు. అమెరికాలో అభివృద్ది చేసిన కమ్యునికేషన్ పద్దతినీ, చేతితో చేసే సంకేతాలను చాలా బాగా అర్థం చేసుకుంటుంది కోకో. అచ్చంగా మనుషులు ఎలా భాషను ఉపయోగిస్తారో కోకో కూడా అదే విధంగా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ఈ సైగలనే కాకుండా దాదాపు రెండు వేలకు పైగా ఇంగ్లీషు భాషా పదాలను కూడా కోకో అర్థం చేసుకోగలదు. మనిషి వలె దీని ఐక్యూ కూడా 70 నుంచి 90 మధ్యలో ఉంటుంది.
అయితే బాధ కల్గించే విషయమేంటంటే, కోకో ఇటీవలే - జూన్ 19న కన్ను మూసింది. ప్రశాంతంగా పడుకున్న కోకో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఎన్నటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్ని కోకో వదిలి వెళ్లిందని The Gorilla Foundation చెప్తుంది. గొరిల్లాల్లోని భావావేశాల స్థాయిని, దాని మేధో శక్తిని అర్థం చేసుకోగలిగాం అని కూడా వారంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఘనాలో శవాల్ని ఆర్నెల్ల దాకా పూడ్చరు
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- #GroundReport ప్రకాశం జిల్లా: తవ్విన కొద్దీ కన్నీరే, నీటి చుక్క జాడలేదు
- అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?
- రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)