అత్యంత అంద విహీనమైన శునకం ఇదే

‘ప్రపంచ అత్యంత అంద విహీన శునకం’ పోటీలో విజేతగా నిలిచేందుకు అంద విహీనంగా, విచిత్రంగా కనిపించే 14 కుక్కలు పోటీ పడ్డాయి. ఈ నెల 23న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పెటాలుమా నగరంలో ఈ పోటీ జరిగింది.

‘జసా జసా’ అత్యంత అంద విహీనమైన శునకంగా ఎంపికైంది. దీనికి నాలుక నేలను తాకేంత పొడవుంది. దవడ భాగంలో లోపం ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఇంగ్లిష్ బుల్ డాగ్ వయసు తొమ్మిదేళ్లు. పోటీ నిర్వాహకులు విజేతకు బహుమతి కింద రూ.1.02 లక్షలు అందిస్తారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, ‘జసా జసా’ అత్యంత అంద విహీనమైన శునకంగా ఎంపికైంది. దీనికి నాలుక నేలను తాకేంత పొడవుంది. దవడ భాగంలో లోపం ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఇంగ్లిష్ బుల్ డాగ్ వయసు తొమ్మిదేళ్లు. పోటీ నిర్వాహకులు విజేతకు బహుమతి కింద రూ.1.02 లక్షలు అందిస్తారు. పోటీలో పాల్గొన్న కుక్కల్లో చాలా వరకు షెల్టర్ల నుంచి కాపాడినవే. పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఈ పోటీని ఏటా నిర్వహిస్తారు.
ఈ కుక్క పేరు హిమిసాబో. ఇది చైనీస్ క్రెస్టిడ్ వీనర్ డాగ్ మిక్స్

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కుక్క పేరు హిమిసాబో. ఇది చైనీస్ క్రెస్టిడ్ వీనర్ డాగ్ మిక్స్
పెకింగీస్ అనే జాతికి చెందిన ‘వైల్డ్ థాంగ్’ గట్టి పోటీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, పెకింగీస్ అనే జాతికి చెందిన ‘వైల్డ్ థాంగ్’ గట్టి పోటీ ఇచ్చింది.
దీని పేరు టీ టీ. ఇది చైనీస్ క్రిస్టెడ్ జాతికి చెందింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, దీని పేరు టీ టీ. ఇది చైనీస్ క్రెస్టిడ్ జాతికి చెందింది.
నోరెళ్లబెట్టిన ఈ శునకం పేరు మాండరీనా

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, నోరెళ్లబెట్టిన ఈ శునకం పేరు మాండరీనా
ఇది రాస్కల్ డ్యూయెక్స్. ఇది కూడా చైనీస్ క్రెస్టిడ్ జాతి శునకమే.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, దీని పేరు రాస్కల్ డ్యూయెక్స్. ఇది కూడా చైనీస్ క్రెస్టిడ్ జాతి శునకమే.
ఇది 2017లో అత్యంత అందవిహీన శునకంగా ఎంపికైంది. దీనిపేరు మార్తా. నియాపోలిటన్ మస్తిఫ్ జాతికి చెందిన ఈ శునకం ఈసారి జరిగిన పోటీకి విచ్చేసింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇది 2017లో అత్యంత అందవిహీన శునకంగా ఎంపికైంది. పేరు మార్తా. నియాపోలిటన్ మస్తిఫ్ జాతికి చెందిన ఈ శునకం ఈసారి జరిగిన పోటీకి విచ్చేసింది.
చిత్రంలో ఎడమ చేతి వైపు ఉన్న స్కామ్ ఈసారి పోటీలో రన్నరప్‌గా నిలిచింది. 2016లో జరిగిన పోటీలో ఇదే విజేత. కుడి వైపున ఉన్న శునకం 2018 సంవత్సరం విజేత

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, చిత్రంలో ఎడమ చేతి వైపు ఉన్న స్కామ్ ఈసారి పోటీలో రన్నరప్‌గా నిలిచింది. 2016లో జరిగిన పోటీలో ఇదే విజేత.