You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మరుగున పడుతున్న గాంధీ స్మృతులు
ఇటీవల జిన్నా చిత్రపటాలు భారతలోని విశ్వవిద్యాలయంలో ఉన్నందుకు సమస్యాత్మక పరిస్థితులను చూశాం. మరి పాకిస్తాన్ లోని కరాచీ, అంటే భారత్ స్వాతంత్ర్యం రాకముందు, ముఖ్యమైన నగరాలలో ఒకటైన కరాచీలో మహాత్ముని స్మారకాలు ఏవిధంగా ఉన్నాయో, అప్పటి కరాచీ నగరంపై మహాత్ముని ప్రభావం ఏవిధంగా ఉండేదో బీబీసీ ప్రతినిధి రియాజ్ సోహెయిల్ అందిస్తున్న క్షేత్ర స్థాయి కథనం.
1931 నాటి జనాభా లెక్కల ప్రకారం, కరాచీలో 47 శాతం జనాభా హిందువులే ఉండేవారు. వారిలో ఎక్కువమంది వ్యాపారస్థులు. ఆరోజుల్లో ప్రజలు గాంధీజీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందేవారు..
జుబ్లీ మార్కెట్లో ఉన్న భవనం రెయిలింగ్ నుంచి ఎదురుగా వెళ్తున్న అందరినీ గాంధీజీ, చూస్తుంటారు . కానీ ఆయన వైపు ఏ ఒక్కరూ చూడటం లేదు.
ఈ భవనం ఆఖరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ పెరుతో ఉంది. ఈ టైర్ బజార్లో చాలా భవనాల్లో గాంధీ గుర్తులు కనిపిస్తాయి.
దేశ విభజన తరువాత, చాలామంది హిందువులు భారత్ కు వలస వచ్చారు.
గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించిన తర్వాత కరాచీలో ఇర్విన్ ఒప్పందం జరగింది.
కరాచీలోని అతి పెద్ద జంతు ప్రదర్శనశాలకు కూడా గాంధీజీతో అనుబంధం ఉంది.
ఖాలిక్ దీనా హాల్ లో స్వాతంత్రోద్యమ నాయకుడు గోపాల కృష్ణ గోఖలే చిత్రపటాన్ని గాంధీ ఆవిష్కరించారు. కానీ ఇప్పడు వాటి జాడలు చెరిగిపోయాయి.
1930 లో సింధ్ హై కోర్టు ఆవరణలో కరాచీ ప్రజలు గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆతర్వాత దాన్ని తొలగించారు.
దేశ విభజన 1947 లో జరిగింది. గొడవలు 1948 లో రాజుకున్నాయి. పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి . ఫలితంగా భారీ సంఖ్యలో ప్రజలు వలస వెళ్లిపోయారు. అప్పట్లో గాంధీజీ విగ్రహానికి హాని తలపెడతారనే భయాలు ఉండేవి. అటువంటి ఆలోచనలతో కూడా కొంతమంది ఉండేవారు. అందుకే ముహమ్మద్ అలీ జిన్నా ఇచ్చిన సూచనల మేరకు ఆ విగ్రహానికి ఎలాంటి హానీ జరగకుండా అక్కడ నుంచి దాన్ని తొలగించాం.
కరాచీ చాంబర్ ఆఫ్ కామర్స్ ని అప్పట్లో భారతీయ వ్యాపార సంఘంగా పిలిచేవారు. దానికి శంకుస్ధాపన గాంధీ చేతుల మీదుగానే జరిగింది. కానీ ఇప్పుడాయన పేరు ఇలా మాటున మరుగున పడిపోయింది.