మీకు తెలుసా? డాల్ఫిన్లు మనుషులను అమితంగా ఇష్టపడతాయంట!
మీకు తెలుసా? బంధించి ఉంచే డాల్ఫిన్స్ మనుషులతో సమయం గడిపినపుడో లేక బొమ్మలతో ఆడుకుంటేనో సంతోషంగా ఉంటాయని ఇటీవలి ఒక పరిశోధన ద్వారా తెలుస్తోంది.
డాల్ఫిన్స్ జీవితం గురించి ఇలా తెల్సుకునే ప్రయత్నం చేయడం ఇదే మొట్టమొదటిసారి.
తెలివైనవి, మనుషులతో మాట్లాడతాయి, ఆడతాయి.
సీసాల్లాంటి మూతి ఉండే డాల్ఫిన్స్, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన క్షీరదాలు. అందుకే చాలామంది డాల్ఫినేరియమ్స్ లో వాటిని ఉంచుతారు. అలాంటిదే ఒకటి పారిస్‌కి సమీపంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల డాల్ఫిన్ చేపలు ఇలా డాల్ఫినేరియమ్స్‌లో ఉన్నాయని అంచనా.
అయితే ఇలాంటి వాతావరణంలో ఈ డాల్ఫిన్స్ తమ జీవితాన్ని ఎలా గడపుతాయన్న అంశంపై ఇటీవలే శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.
వాటి నీటి విన్యాసాలు మనకు చాలా ఆనందం కల్గించవచ్చు. నిజానికి డాల్ఫిన్లు అంతగా ఆకర్షించడానికి కారణం కూడా అదే. కానీ, ఒక యువ శాస్త్రవేత్త, మూడేళ్ల పాటు వాటిపైనే పరిశోధనలు చేస్తూ వాటి ప్రవర్తనను డీకోడ్ చేసి ఏం చేస్తే వాటికి ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఇది కేవలం వాటి ప్రవర్తనను, వాటిలో ఉత్సాహాన్ని తెలుసుకునేందుకు చేసిన ఒక ప్రయోగం.
మనుషులతో గడిపే సమయం, ఆట వస్తువులతో గడిపే సమయం, ఏకాంతంగా గడిపే సమయం. ఇలా ఈ మూడు విభాగాల్లో వాటిని అంచనా వేయడానికి, డాల్పిన్ల శరీరాకృతి, వాటి కదలికలు, వాటి చూపు తదితర అంశాలను కూడా తన పరిశోధనలో పరిగణనలోకి తీసుకున్నారు.
అయితే, విమర్శకులు మాత్రం , స్వేచ్ఛగా జీవించాల్సిన ఈ సముద్ర జీవులను, కాంక్రీట్ మడుగుల్లో బందీలుగా ఉంచడం సరైనది కాదంటున్నారు.
ఇలా బంధించి ఉంచిన ఈ చేపల జీవన పరిస్ధితులను మరింత మెరుగ్గా ఎలా చెయ్యొచ్చో తెలుసుకోవడం ఈ పరిశోధన ప్రధానోద్ధేశం.
అదే సమయంలో స్వేచ్ఛగా సముద్రంలో ఉన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉన్నాయా? లేదా బందీలుగా ఉన్నపుడు ఎక్కువ సంతోషంగా ఉన్నాయా? అన్న విషయం మాత్రం ఈ పరిశోధన ఆధారంగా చెప్పలేం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)