చిత్రమాలిక: మీరు చూడని స్టీఫెన్ హాకింగ్ జీవన చిత్రాలు

జీవితంలో చాలా కాలం మోటార్ న్యూరాన్ వ్యాధితో పోరాడిన స్టీఫెన్ హాకింగ్ తన 76వ యేట మరణించారు.

1992లో ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్
ఫొటో క్యాప్షన్, 1942లో జన్మించిన స్టీఫెన్ హాకింగ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌ను అభ్యసించారు. తర్వాత కాస్మాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోసం కేంబ్రిడ్జికి వెళ్లారు.
ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 22 ఏళ్ల వయసులో హాకింగ్‌కు అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. తన మొదటి భార్య జేన్(చిత్రంలో ఉన్నారు)తో వివాహానికి సిద్ధమవుతుండగా, డాక్టర్లు ఆయన ఎక్కువ కాలం జీవించరని తేల్చి చెప్పారు. అయితే వారిద్దరూ 26 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా కలిగారు.
ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, క్రమంగా హాకింగ్ వీల్ చెయిర్‌కే పరిమితమయ్యారు. వాయిస్ సింథసైజర్‌తో తప్ప మాట్లాడగలిగే వారు కాదు. 1988లో ఆయన రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’తో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఆ పుస్తకం కోటి కాపీలకు పైగా అమ్ముడుపోయింది.
ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్, ఇలాయిన్ మేసన్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 1995లో హాకింగ్ తన నర్సులలో ఒకరైన ఇలాయిన్ మేసన్‌ను వివాహం చేసుకున్నారు. పదకొండేళ్ల పాటు కలిసి జీవించాక వారు విడాకులు తీసుకున్నారు.
భారరహిత స్థితిని అనుభవిస్తున్న స్టీఫెన్ హాకింగ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2007లో హాకింగ్ కాళ్లూ చేతులూ చచ్చుబడి కూడా జీరో గ్రావిటీ కోసం రూపొందించిన ప్రత్యేక విమానంలో భారరహిత స్థితిని అనుభవించిన మొట్టమొదటి వ్యక్తిగా పేరొందారు. అప్పుడు హాకింగ్, ‘‘అంతరిక్షంలోకి కనుక వెళ్లకపోతే మానవజాతికి భవిష్యత్తు లేదు’’ అన్నారు.
జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న హాకింగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలలో ప్రసంగాలు చేశారు. పక్కనున్న చిత్రం 2008లో ఆయన జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో చేస్తున్న ప్రసంగం.
ఒబామా చేతుల మీదుగా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ పురస్కారం అందుకుంటున్న హాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గణితశాస్త్రం, సైన్సు రంగాలలో ఆయన అనేక పురస్కారాలు పొందారు. 2009లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాకింగ్‌ను ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరించారు.
ఎలిజబెత్ రాణితో స్టీఫెన్ హాకింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2014లో సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో హాకింగ్ ఎలిజబెత్ రాణిని కూడా కలిశారు.
ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రీమియర్ సందర్భంగా హాకింగ్‌తో ఎడ్డీ రెడ్‌మీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014లో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ‘ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్’ అన్న సినిమా వచ్చింది. దానిలో ఎడ్డీ రెడ్‌మీన్ హాకింగ్ పాత్రను పోషించారు.
హోలోగ్రామ్ ద్వారా సంభాషిస్తున్న హాకింగ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2017లో కేంబ్రిడ్జిలోని తన ఆఫీస్ నుంచి హాకింగ్ హాంకాంగ్‌లోని ప్రేక్షకులతో హోలోగ్రామ్ ద్వారా లైవ్‌లో సంభాషించారు. హాకింగ్ మరణానంతరం కూడా ఆయన వారసత్వం కొనసాగుతుందని ఆయన పిల్లలు చెప్పారు.