జుగాడ్ : ఎలా వస్తాయండీ.. ఇలాంటి ఐడియాలు!

ఒక అంశం మీద పాఠకులు పంపిన ఫొటోలతో ఈ గ్యాలరీ రూపొందించా. ఈ గ్యాలరీ అంశం ‘జుగాడ్’. అంటే.. తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ చేసే ఆవిష్కరణలు.

A dog with its back legs strapped back / వెనుక కాళ్లు దెబ్బతిన్న కుక్కకి చక్రాల అమరిక

ఫొటో సోర్స్, Doris Enders

ఫొటో క్యాప్షన్, గోవా నుంచి డోరిస్ ఎండర్స్: ‘‘నేను రోజూలాగే నడుచుకుంటూ వెళుతున్నపుడు ఒక ఇంటి ఆవరణలో ఈ కుక్క అరుచుకుంటూ రావటం కనిపించింది. కాళ్లు దెబ్బతిన్న ఈ కుక్క తిరుగాడేందుకు వీలుగా ఇలా పరికరాన్ని అమర్చటం నాకు చాలా నచ్చింది. వాళ్లు ఈ కుక్కని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమయింది.’’
Woman on a horse with her dog / తన కుక్కతో సహా గుర్రం మీద కూర్చున్న ఓ మహిళ

ఫొటో సోర్స్, Lia Lopes

ఫొటో క్యాప్షన్, లియా లోప్స్: ‘‘మన కార్లను పక్కనపడేసి గుర్రాల మీద ప్రయాణానికి తిరిగి వెళ్లడం.. పర్యావరణానికి ఎంతో మేలు చేసే పరిష్కారమని.. ఒత్తిడి తగ్గించి ఆహ్లాదం పెంచుతుందని.. అదో జుగాడ్ అని నేను నమ్ముతాను.
A broken hair held up with stones / విరిగిన చోట రాళ్లు పెట్టి కూర్చునేందుకు అనువుగా రైలింగిక్ కట్టేసివున్న కుర్చీ

ఫొటో సోర్స్, Gayathri Selvam

ఫొటో క్యాప్షన్, గాయత్రి సెల్వం: ‘‘అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం సమీపంలో తీసిన ఫొటో ఇది. ఈ కుర్చీ సృష్టికర్త ఆలోచనను మెచ్చుకుని తీరాలి.’’
electrically operated drum / కరెంటుతో మోగించే డ్రమ్

ఫొటో సోర్స్, Thirunavukkarasu Viswanathan

ఫొటో క్యాప్షన్, తిరునావుక్కరసు విశ్వనాథన్: ‘‘ఇటీవల మా స్వగ్రామం టక్కోళామ్ (చెన్నై దగ్గర) వెళ్లినపుడు స్థానిక దేవాలయంలో కనిపించిన ఈ ఎలక్రిక్ డ్రమ్ ఫొటో తీశాను. దీనిని గతంలో ఒక వ్యక్తి ఉపయోగించేవారు. కానీ తర్వాత దీనిని.. స్విచ్చు నొక్కితే కరెంటుతో పనిచేసేలా రూపొందించారు. చాలా చౌకగా దీనిని తయారు చేయటం ఆశ్చర్యం కలిగించింది.’’
A man on a scooter with his family / కుటుంబ సభ్యులతో కలిసి స్కూటర్ మీద ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి

ఫొటో సోర్స్, sunil pareek

ఫొటో క్యాప్షన్, సునీల్ పరీక్: ‘‘ఈ ‘జుగాడు’ తన బైకుకి ఒక ట్రాలీ అమర్చి దానిని కుటుంబం మొత్తం ప్రయాణించగల వాహనంగా మార్చారు.’’
A man touching an orchid with a toothpick / ఆర్చిడ్‌ను టూత్‌పిక్‌తో టచ్ చేస్తున్న ఓ వ్యక్తి

ఫొటో సోర్స్, Robert Saunders

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ సాండర్స్: ‘‘గ్వాడెలోప్‌లో వెనిలా ఆర్చిడ్‌కు పరాగ సంపర్కం చేయటం కష్టమైన పని. ఇక్కడ ఇందుకోసం ఒక టూత్‌పిక్‌ను ఉపయోగించారు. ఆర్చిడ్‌లోని శీర్షాగ్ర భాగాన్ని టూత్‌పిక్‌తో పైకి లేపి.. పైన వేలాడుతున్న పరాగకోశాన్ని అదే టూత్‌పిక్‌తో కిందింకి వంచి కీలాగ్రానికి తాకించటం ద్వారా.. స్వీయ పరాగ సంపర్కం జరిగేలా చేస్తున్నారు.’’
Shopping trolley / షాపింగ్ ట్రాలీ

ఫొటో సోర్స్, Yvonne Botha

ఫొటో క్యాప్షన్, వోన్ బోతా: ‘‘ఇల్లులేని ఒక నిరాశ్రయుడు ఒక షాపింగ్ ట్రాలీకి పాల పెట్టెలు అమర్చి ఇలా రవాణా సాధనంగా మార్చి ఉపయోగించుకుంటున్నారు.’’
An underwater diver / అండర్ వాటర్ డైవర్

ఫొటో సోర్స్, Elaine Miller

ఫొటో క్యాప్షన్, ఎలైన్ మిల్లర్: ‘‘గ్రీక్ ఐలాండ్ ఆఫ్ పరోస్‌లో నేను ఒక చౌకైన అండర్‌వాటర్ డిస్పోజబుల్ కెమెరా కొన్నాను. దానితో తీసిన ఫొటోలు చాలా ఆశ్యర్యకరంగా అద్భుతంగా వచ్చాయి.’’
A man balances tubs of snacks on his head / తినుబండారాల డబ్బాలను తల మీద మోస్తున్న ఓ వ్యక్తి

ఫొటో సోర్స్, Siddhika Jatia

ఫొటో క్యాప్షన్, సిద్ధికా జాటియా: ‘‘వారణాసిలో ఓ చిరువ్యాపారి ఫొటో ఇది. అతడు తన దుకాణం మొత్తాన్నీ తన తల మీద మోస్తుండటం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంతకన్నా ఉత్తమమైన ‘జుగాడ్’ ఏముంటుంది?’’
ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్

ఫొటో సోర్స్, Doris Enders

ఫొటో క్యాప్షన్, డోరిస్ ఎండర్స్: ‘‘ఇలాంటి పెట్రోల్ స్టేషన్లు గోవాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నిజమైన పెట్రోల్ బంకులు దూరంగా ఉండటం ఒక కారణమైతే.. పెట్రోల్ అయిపోయిన స్కూటర్లు, బైకుల కోసం రెండో కారణం.‘‘
A makeshift hut on the beach / బీచ్‌లో తాత్కాలిక పూరిల్లు

ఫొటో సోర్స్, Harvey Jones

ఫొటో క్యాప్షన్, హార్వీ జోన్స్: ‘‘డోర్సెట్‌లోని చెసల్ బీచ్‌లో జాలర్ల పూరిళ్లలో ఒకటి ఇది. చెత్త, పారేసిన వస్తువలతో తయారు చేసిన ఈ పూరిల్లు చూడటానికి కూడా చక్కగా ఉంది. దగ్గర్లో గూళ్లు కట్టుకున్న రీవపిట్టల ఆవాసాన్ని గమనించేందుకు ఈ పూరింటిపై ఓ సీసీటీవీ కెమెరాను కూడా అమర్చారు. ఇది చాలా రకాలుగా ‘జుగాడ్’కి ప్రతిరూపంగా నాకు కనిపించింది.’’
Farm gate / పొలం గేటు

ఫొటో సోర్స్, Nikki Rose Terry

ఫొటో క్యాప్షన్, నిక్కీ రోజ్ టెర్రీ: ‘‘సౌత్ డౌన్స్ వరకూ నడుచుకుంటూ వెళుతుంటే మధ్యలో ఓ పొలం దగ్గర ఈ గేటు కనిపించింది. తుప్పుపట్టిన పాత నాగలి, ట్రాక్టర్ భాగాలతో, పాత చైనుతో ఈ గేటును తయారు చేశారు.’’
A mobile phone suspended in a cut water bottle /కత్తిరించిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌‌లో మొబైల్ ఫోన్‌

ఫొటో సోర్స్, Hannan Khamis

ఫొటో క్యాప్షన్, హన్నా ఖామిస్: ‘‘పెరూ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ స్థానికుల ఇళ్లవద్ద ఆగినపుడు ఈ దృశ్యం కనిపించింది. అక్కడున్న మహిళ మాకు మంచినీరు అమ్మింది. ఆమె దగ్గర ఒక కోతి, నాలుగు అందమైన చిలుకలు ఉన్నాయి. ఆ పక్కనే ఇంటి గోడకు ఇలా ఫోన్ వేలాడదీసి కనిపించటం ఆకట్టుకుంది. ప్లాస్టిక్ డబ్బాను అడ్డంగా కోసి.. దానిని మొబైల్ ఫోన్‌ను ఉంచటానికి అనుకూలంగా తయారు చేశారు.’’
A water bottle tied to a pipe / పైపుకు కట్టిన ప్లాస్టిక్ బాటిల్

ఫొటో సోర్స్, prerna jain

ఫొటో క్యాప్షన్, ప్రేరణ జైన్: ‘‘ఢిల్లీలో ఓ నీటి ట్యాంకర్ నుంచి నీటి లీకేజీని ఆపటానికి.. నీటి పైపుకు ఇలా ఖాళీ కూల్‌డ్రింక్ ప్లాస్టిక్ సీసాను అమర్చి, పాత ట్యూబ్ ముక్కతో కట్టేశారు.’’
బ్రిటన్‌లోని నార్తంబర్లాండ్‌లో కుర్చీలో పెరుగుతున్న పూల మొక్కలు

ఫొటో సోర్స్, Will Ayre

ఫొటో క్యాప్షన్, విల్ ఐర్: ‘‘పాత కుర్చీకి కొత్త జీవం పోస్తూ ఇలా సుందరంగా తీర్చిదిద్దటం స్ఫూర్తిదాయకంగా కనిపించింది.’’