ఆస్ట్రేలియాలో విద్యార్థుల సోలార్ కార్ల రేస్

కార్ల పోటీల్లోనే ప్రత్యేకమైన ఒక పోటీ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీలో సౌర విద్యుత్‌తో నడిచే కార్లే తలపడతాయి.

సోలార్ కార్లతో పోటీదారులు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచం నలుమూలల నుంచి 30కి పైగా దేశాలకు చెందిన బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి.
డార్విన్‌లో బయల్దేరిన ఒక కారు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరం నుంచి దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం వరకు మూడు వేల కిలోమీటర్ల దూరం మేర ఈ రేస్ జరుగుతుంది.
డార్విన్‌లో ఒక పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నకారు డ్రైవర్‌ను అభినందిస్తున్న సహచరులు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కార్లన్నీ విద్యార్థులు సొంతంగా తయారుచేసినవే. ప్రపంచ సోలార్ ఛాలెంజ్‌ అనే ఈ పోటీలో విద్యార్థులు జట్లుగా పోటీపడతారు.
పంచ్ పవర్‌ట్రైన్‌కు చెందిన ‘పంచ్ టు’ కార్

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, రేస్ ప్రారంభానికి ముందు పోటీదారులు తమ కార్లతో ట్రయల్స్ నిర్వహించారు. పోటీ శనివారం మొదలైంది.
ట్రయల్స్‌లో పాల్గొన్న ఒక యూకే కారు డ్రైవర్

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి దశలో బెల్జియం‌కు చెందిన పంచ్ పవర్‌ట్రైన్ జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇది గంటకు 83.4 కిలోమీటర్ల సగటు వేగంతో సాగింది.
ట్రయల్స్‌లో పాల్గొన్న కెనడా కారు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, జట్లు డార్విన్ నుంచి బయల్దేరాక పోటీ ముగిసే వరకు స్థానిక కాలమానం ప్రకారం ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రయాణిస్తూనే ఉండాలి. ఆ సమయానికి ఎక్కడ ఉంటే అక్కడే బస చేయాలి. ఆహారం, బస ఏర్పాట్లు అన్నీ సొంతంగానే చేసుకోవాలి.
తైవాన్ కారును పరిశీలిస్తున్నసంబంధిత జట్టు సభ్యులు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, రేస్ సాగే మార్గంలో ఏడు చోట్ల తనిఖీ కేంద్రాలు ఉంటాయి. అక్కడ కార్ల టైర్ల ప్రెజర్ సరిచూసుకోవడం లాంటి కనీస నిర్వహణ పనులను మాత్రమే అనుమతిస్తారు.
డార్విన్‌లో బయల్దేరిన టర్కీ కారు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, జట్లు మూడు విభాగాల్లో పోటీపడతాయి.
దూసుకుపోతున్న ఒక సోలార్ కారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోటీ విభాగాలను ఛాలెంజర్ క్లాస్, క్రూయిజర్ క్లాస్, అడ్వెంచర్ క్లాస్‌ అని వ్యవహరిస్తారు.
శనివారం డార్విన్‌‌లో తమ కార్లతో పాటు ఫొటోలు దిగుతున్న జట్లు

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యంత వేగంగా ప్రయాణించగలిగే జట్లు గురువారం అడిలైడ్ చేరే అవకాశముంది.