కాల్పుల ఘటనల దృశ్యాలు

లాస్ వెగాస్‌లో ఒక సంగీత కార్యక్రమం జరుగుతుండగా స్టీఫెన్ పాడాక్ అనే సాయుధుడు కాల్పులు జరిపాడు. 50 మందికి పైగా చనిపోయారు. 200 మంది గాయపడ్డారు.

భీతిల్లిన జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరుబయట సంగీత కార్యక్రమం జరుగుతుండగా, దానికి ఎదురుగా ఉన్న హోటల్‌లోని 32వ అంతస్తులో ఉన్న సాయుధుడు ప్రేక్షకులపై కాల్పులు జరిపాడు.
ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంతకుడు వందల తూటాలు కాల్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పారిపోతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజలంతా చెల్లాచెదురై పారిపోతుండడంతో అక్కడ గందరగోళం నెలకొందని సాక్షులు తెలిపారు.
పారిపోతున్న మహిళ, పురుషుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాడితో భయాందోళనలకు గురైన జనం ఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు.
అధికారితో మాట్లాడుతున్న నలుగురు వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని, లాస్ వెగాస్‌ స్ట్రిప్‌కు రాకపోకలు చేయొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దారిలో పడిపోయిన కౌబాయ్ బూట్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మూడు రోజుల సంగీత ఉత్సవంలో చివరి రోజున ఈ కాల్పుల సంఘటన జరిగింది.
లాస్ వెగాస్ స్ట్రిప్‌పై కెసినో వెలుపల సాయుధ పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాల్పులకు పాల్పడ్డ స్థానిక వ్యక్తిని కాల్చివేసినట్టు పోలీసులు తెలిపారు.
అప్రమత్తంగా ఉన్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనుమానిత వ్యక్తితో ప్రయాణించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మోకాళ్లపై నిలబడ్డ వ్యక్తితో పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రోపికానా ఎవెన్యూ నుంచి వస్తున్న ఈ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లే రోడ్లపై రాకపోకల్ని నిలిపివేశారు.