కాటలోనియా రిఫరెండం ఉద్విగ్న క్షణాలు

కాటలోనియాలో ఆదివారం నిర్వహించిన రిఫరెండంలో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. కానీ, రిఫరెండం చట్ట విరుద్ధమని కోర్టు చెప్పడంతో ఓటింగ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. వారిని ప్రజలు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి.