భారత్ జోడో: రాజీవ్ గాంధీ బాటలో రాహుల్ యాత్ర

హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగురవేశారు.

భారత్ జోడో యాత్రలో ఆయన ఇప్పటి వరకూ అడుగుపెట్టిన అతి పెద్ద నగరం హైదరాబాదే. నగరంలోకి వచ్చిన రాహుల్‌కి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నాయకులు.

వివిధ వర్గాల వారితో మాట్లాడుతూ, కలసి నడుస్తూ రాహుల్ యాత్ర సాగింది. మంగళవారం మధ్యాహ్నం చార్మినార్ దగ్గర జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 1990 అక్టోబర్‌లో రాజీవ్ గాంధీ ఇక్కడే జాతీయ జెండా ఎగురవేసి, సద్భావనా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమ విశేషాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)