You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జర్మనీపై రష్యా గ్యాస్ నిలుపుదల ఎఫెక్ట్: గ్యాస్ కొరత, కరెంటు కోతల భయంలో ప్రజలు
రష్యా బెదిరింపుల నేపథ్యంలో యూరప్ దేశాల ప్రభుత్వాలన్నీ ఇంధన సంక్షోభాన్ని అధిగమించే మర్గాలను అన్వేషిస్తున్నాయి.
రానున్న శీతాకాలం నాటికి యూరప్‌కు గ్యాస్ సరఫరాలను వ్లాదిమిర్ పుతిన్ నిలిపేస్తారని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.
దాంతో ప్రస్తుతం అమలులో ఉన్న ఇంధన విధానంపై జర్మనీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
దేశంలోని చివరి అణు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తిని మరింత కాలం పాటు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి జెన్నీ హిల్ అందిస్తోన్న రిపోర్ట్.
యూరప్‌పై ఒత్తిడిని పెంచుతున్నారు వ్లాదిమిర్ పుతిన్.
జర్మనీ తమ ఇంధనంపైనే ఆధారపడుతుందని, దాని పరిశ్రమలకు తమ గ్యాస్ అవసరమని పుతిన్‌కు బాగా తెలుసు.
జర్మనీలో ఉత్పత్తయ్యే అల్యూమినియం అనేక దేశాలకు ఎగుమతి అవుతుంది.
కార్లు, వైద్య పరికరాలు, విండ్ టర్బైన్లకు ఇది చాలా అవసరం.
కాబట్టి, వచ్చే చలికాలంలో కొరతలు తప్పవని భావిస్తున్నారు.
యూరప్‌కు గాస్ సరఫరాలో రష్యా కోత విధిస్తోంది. అయితే, తప్పు జర్మనీదేనని ప్రపంచం నమ్మాలని అది కోరుకుంటోంది.
ఇక్కడ జర్మన్ టర్బైన్‌తో జర్మన్ ఛాన్సలర్‌ని చూడొచ్చు. ఈ టర్బైన్ రష్యాకు చేరకుండా యూరప్‌కు గ్యాస్ సరఫరా చేయలేమని రష్యా అంటోంది.
కానీ అది రెడీగా ఉందని, రష్యా తమకు గ్యాస్ సరఫరా నిలిపివేయాల్సిన సాంకేతిక కారణమేదీ లేదని ఒలాఫ్ ష్కోల్జ్ నొక్కి చెబుతున్నారు.
జర్మనీలో బొగ్గు వినియోగాన్ని, అణు విద్యుత్ ప్లాంట్లను దశల వారీగా నిలిపేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు ఒలాఫ్ ష్కోల్జ్. కానీ ఇప్పుడు ఆయన పునరాలోచిస్తున్నారు.
జర్మనీలో మిగిలి ఉన్న మూడు అణు విద్యుత్ స్టేషన్లు కేవలం విద్యుత్తును మాత్రమే, అదీ కొద్ది మొత్తంలోనే అందిస్తాయని ఆయనన్నారు.
ఏదేమైనా, వాటిని కొనసాగించక తప్పకపోవచ్చు.
కానీ రాజకీయంగా అది ఓ పెద్ద వెనుకడుగు అవుతుంది.
వాటిలో ఒక ప్లాంట్ బవేరియాలో ఉంది. ఆ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌లో 12 శాతం దీని నుంచే అందుతుంది.
ఈ ఏడాది చివరకల్లా దీనిని మూసేయాల్సి ఉంది.
సమీప పట్టణం లాండ్‌షట్‌లో ప్రజలకు... జర్మనీ రానున్న చలికాలానికి సరిపడేంత గ్యాస్ నిల్వ చేసుకోలేదన్న విషయం తెలుసు.
జర్మనీలో మండుతున్న ఎండాకాలంలో వ్లాదిమిర్ పుతిన్ ఓ పొడవాటి నీడను పరుస్తున్నారు. ఆయన ఇంకా ఆర్థిక, రాజకీయ గందరగోళాన్ని సృష్టించకపోవచ్చు గానీ, యూరప్ నడి మధ్యలో చిచ్చు రేపాలని ఆయన కోరుకుంటారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. జర్మనీ వంటి ప్రభుత్వాలు కఠినమైన, ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకునేలా ఆయన ఒత్తిడి చేస్తున్నారు.
ఇవన్నీ ఇంధన బిల్లులు విపరీతంగా పెరగడానికి ముందే చూస్తున్న పరిణామాలు.
యూరప్ ఈసారి అనిశ్చితమైన శీతాకాలాన్ని చవి చూడనుంది. దాని నేతలు రష్యన్ ఆధిపత్యం నుంచి యూరప్‌ను కాపాడుకునే కీలకమైన పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?
- 'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శకలం: అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది..
- సీఎంకు ప్రత్యేక గది, హెలీప్యాడ్, దాదాపు 10లక్షల సీసీ కెమెరాల అనుసంధానం....కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- జూ ఎన్‌క్లోజర్‌లో మొసళ్లకు బదులు అందమైన హ్యాండ్‌బ్యాగ్ పెట్టారు, సందర్శకులు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు
- హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)