తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇదీ..

కొన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం ఉండదు. వ్యక్తిని బట్టీ సమాధానం మారుతుంటుంది. అయితే, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అలాంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మేం నిపుణులతో మాట్లాడాం.

‘‘తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది’’అనేదే ఆ ప్రశ్న.

పూజ ఖాడే పాఠక్ పుణెలో ఉంటారు. హెచ్ఆర్ ఫీల్డ్‌లో ఆమె పనిచేస్తున్నారు. 23ఏళ్ల వయసులో ఆమె తల్లి కావాలని అనుకున్నారు. ఇప్పుడు ఆమె వయసు 33ఏళ్లు. ఆమె కుమార్తె వయసు పదేళ్లు. ఎప్పుడు తల్లి కావాలనే ప్రశ్నకు ముందుచూపుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు.

‘‘ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌లోనూ కాంపిటీషన్ ఉంది. అప్పట్లో నా కెరియర్ కూడా అంత గొప్పగా ఉండేది కాదు. అందుకే అప్పుడే తల్లి అయ్యేందుకు విరామం తీసుకోవాలని అనుకున్నాను. అప్పుడే విరామం తీసుకుంటే, భవిష్యత్‌లో మంచి అవకాశాలు వచ్చినప్పుడు విరామం తీసుకోవాల్సిన అవసరం ఉండదని భావించాను’’అని పూజ చెప్పారు.

‘‘కెరియర్‌తోపాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాను. 23ఏళ్ల వయసులో నా ఆరోగ్యం చాలా బావుండేది. ఒత్తిడి, ఇతర ప్రభావాలను మెరుగ్గా ఎదుర్కొనే స్థితిలో నా ఆరోగ్యం ఉండేది. మరోవైపు నా బిడ్డ, నాకు మధ్య వయో భేదం ఎక్కువగా ఉండకూడదని అనుకున్నాను’’అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)