వడగళ్లు ఎలా ఏర్పడతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వడగళ్ల వాన...

భారత్‌లో సరిగ్గా 134 ఏళ్ల క్రితం ఒకే రోజు 288 మంది ప్రాణాలు తీసింది.

వడగళ్ల వాన...

అమెరికాలో ఏటా 1000 కోట్ల డాలర్ల ఆస్తి నష్టానికి కారణమవుతోంది.

వడగళ్ల వాన...

కెనడాలో 2020 జూన్ నెలలలో ఏకంగా 70 వేల ఇళ్లను నాశనం చేసింది.

ఇండియాలో ఏటా అత్యధికంగా వడగళ్ల వానలకు నష్టపోతున్న రాష్ట్రం మహారాష్ట్ర.

దేశంలో వడగళ్ల వానల కారణంగా ఏటా వందల కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరుగుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే... ఏప్రిల్-మే నెలల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని పలకరించి, ఆశ్చర్య పరిచే వడగళ్ల వానలు కొన్ని ప్రాంతాల్లో అదే స్థాయిలో కష్టాలను, కడగండ్లను కూడా మిగులుస్తున్నాయి.

గడిచిన కొద్ది రోజులుగా కురిసిన వడగళ్ల వానల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మామిడి, జీడి మామిడి, అరటి, బొప్పాయి, పుచ్చకాయలు తదితర సీజనల్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇంతకీ వడగళ్లు ఎలా ఏర్పడతాయి.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)