BBC ISWOTY నామినీ మీరాబాయి చాను: తలపై కట్టెల మోపు నుంచి మెడలో ఒలింపిక్స్ రజత పతకం వరకు..
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) అవార్డు నామినీల్లో ఒకరు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చాను.
మీరాబాయి చాను 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన ఘనత ఆమెదే.
2016 రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో గెలుపు వరకు మీరాబాయి ప్రయాణం మరచిపోలేనిది.
ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జన్మించారు మీరాబాయి చాను. ఆమె తండ్రి ఒక టీ స్టాల్ నడిపేవారు.
కెరీర్ తొలి దశలో ఆమె అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగారు.

