You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విదేశాలను తలదన్నే ఎన్నో టూరిస్ట్ స్పాట్‌లు విశాఖపట్నం జిల్లాలో.. చూశారా మీరు..
అందమైన బీచ్‌లు, పార్కులు, వలిసె పువ్వులు, జలపాతాలు చూసేందుకు ఇంతకుముందు విశాఖకు టూరిస్టులు వచ్చేవారు. కానీ ఇప్పుడు పాల సముద్రాల్ని చూసేందుకు పర్యటకులు తరలి వస్తున్నారు.
పాడేరులో ఉన్న వంజంగి కొండను పాల సముద్రం అని పిలుస్తున్నారు. చెరువుల వేనం తర్వాత ప్రచారంలోకి వచ్చిన ఈ పొగమంచు కొండకు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంది.
పాడేరుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, ట్రెక్కింగ్ కూడా ఎక్కువగా చేయవలసిన అవసరం లేకపోవడంతో వంజంగికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు.
ఇక్కడ గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు...పాలసముద్రాన్ని తలపించే విధంగా ఉండటంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.
శీతాకాలం సమయంలో అరకు ప్రాంతానికే టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ వలిసె పువ్వులు, పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, బొర్రా కేవ్స్ వంటి టూరిస్టు స్పాట్లు ఉన్నాయి. పాడేరుకు సాధారణంగా టూరిస్టులు ఎక్కువగా రారు.
కానీ వంజంగి కొండపై మేఘాలు పాలసముద్రం వలె కనిపిస్తున్నాయంటూ వీడియోలు హాల్‌చల్ చేయడంతో ఇక్కడికి టూరిస్టుల రాక మొదలైంది.
ఇవి కూడా చదవండి:
- తిట్లు, నిందలు, అసత్యాలు, నిరాధారమైన కుట్రలు: బాలీవుడ్‌ను వ్యతిరేకిస్తూ యూట్యూబ్‌లో వ్యూస్ పెంచుకుంటున్న వ్యక్తులు
- భయంకరమైన హైవే జర్నీ.. విజయంతంగా డ్రైవింగ్ పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా ఇస్తారు
- కేంద్ర బడ్జెట్ క్విజ్: బడ్జెట్ అనే పదాన్ని ఏ భాష నుంచి కనిపెట్టారు? స్వతంత్ర భారతదేశానికి తొలి ఆర్థిక మంత్రి ఎవరు?
- NeoCov కరోనాలో అత్యంత ప్రమాదకరం ఇదేనా? దీని గురించి డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)