సింఘు బోర్డర్: ఏడాదికి పైగా సాగిన నిరసనల అనంతరం ఇళ్లకు వెళ్తున్న రైతులు

ఆందోళనలు చేస్తున్న రైతులు శనివారం తమ తాత్కాలిక గుడారాలను తొలగించడం ప్రారంభించారు. ఇళ్లకు తిరిగి వెళ్తున్న సందర్భంగా విజయ యాత్రను నిర్వహించారు.

దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ఉపసంహరించుకున్న తర్వాత దిల్లీ సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు తమ ఆందోళనలు ముగించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లడం మొదలైంది.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, నిరసన ప్రదర్శనలు జరిగిన ప్రాంతంలో గుడారాలు ఖాళీ చేసి వెళ్తున్న రైతులు
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, నిరసనలు జరిగే ప్రాంతంలో ఉన్న వస్తువులన్నీ ట్రాక్టర్ ట్రాలీలో వేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న రైతులు
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని సింఘు, టికరీ, గాజీపూర్ సరిహద్దుల్లో రైతులు ఏడాదికి పైగా నిరసన ప్రదర్శనలు నిర్వహించిన రైతులు శనివారం తమ తాత్కాలిక గుడారాలను తొలగించడం ప్రారంభించారు. ఇళ్లకు తిరిగి వెళ్తున్న సందర్భంగా విజయ యాత్రను నిర్వహించారు.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, రైతుల ఒక పెద్ద సమూహం శనివారం నిరసనలు జరిగిన ప్రాంతాన్ని ఖాళీ చేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్ శుక్రవారం ఏఎన్ఐతో చెప్పారు.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, ఇది ఇప్పటికే జరగాల్సింది. కానీ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతిచెందడంతో రైతులు దీనిని వాయిదా వేశారు.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినా సరిహద్దుల్లోంచి వెనక్కు వెళ్లకూడదని రైతులు నిర్ణయిచారు.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు

ఫొటో సోర్స్, shubam koul

ఫొటో క్యాప్షన్, కనీస మద్దతు ధరపై గ్యారంటీ ఇవ్వాలని, ఆందోళనలు చేసిన రైతులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు వెనక్కు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు
ఫొటో క్యాప్షన్, చివరికి ఈ డిమాండ్లపై ఒక ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రతిపాదించిన తర్వాత రైతులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించారు.
దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రైతులు
ఫొటో క్యాప్షన్, ఎంఎస్‌పీ అంశంపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై అంగీకారం కుదిరింది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారు.