బకింగ్‌హాం కెనాల్: ఒకప్పటి ప్రధాన జల రవాణా మార్గం ఇప్పుడెందుకు ఇలా మారింది

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ ఒకప్పుడు ఉన్న జల రవాణా మార్గాన్ని బకింగ్ హాం కెనాల్ అంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పెదగంజాం నుంచి తమిళనాడులోని మరక్కణం వరకూ బకింగ్‌హాం కాలువ ఉంటుంది. బ్రిటిష్ పాలనలో ఈ కాలువ ఓ వెలుగు వెలిగిందనే చెప్పవచ్చు.

అప్పట్లో రవాణా అవసరాల కోసం పూర్తిగా ఈ కాలువపైనే ఆధారపడేవారు. 1806లో ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. తమిళనాడులో 163 కిలో మీటర్ల పొడవున, ఏపీలో మరో 257 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంటుంది.

ఈ కాలువకు 1878లో బకింగ్‌హాం కాలువగా నామకరణం చేశారు. అనాటి గవర్నర్ డ్యూక్ ఆఫ్ బకింగ్‌హాం పేరుతో ఈ కాలువను పిలుస్తున్నారు.

మొదట దీనిని కొక్రేన్ కాలువగా పిలిచేవారని రికార్డుల్లో ఉంది. బ్రిటిష్ వారి నుంచి కాలువ కాంట్రాక్ట్ తీసుకున్న కొక్రేన్ అనే వ్యక్తి అభివృద్ధి చేయడంతో మొదట ఆయన పేరుతో దీనిని పిలిచేవారు.

ఈ జల రవాణా మార్గం పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)