You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC ISWOTY: జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన అంజు బాబి జార్జ్ ప్రస్థానమిదీ...
భారత క్రీడా రంగంలో విశేష కృషి చేసి, భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలిచిన మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్.. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు' ఎంపికయ్యారు.
ఆమె ఇప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ మెడల్ సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2021 మార్చి ఎనిమిదో తేదీన.. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీ ఈ పురస్కార వేడుకను వర్చువల్‌గా నిర్వహించి, విజేతను ప్రకటించారు.
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నందుకు అంజు ఆనందం వ్యక్తం చేస్తూ, తనకు నిరంతరం మద్దతునిస్తూ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, సహచరుడికి కృతజ్ఞతలు తెలిపారు.
"సవాళ్లను, పరిమితులను ఎదుర్కొంటూ పోరాడితే మీరు మరింత శక్తిమంతులవుతారు. లక్ష్యం మీదే దృష్టి పెడుతూ దినదినాభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తూ ఉండాలని" ఆమె అథ్లెట్లు అందరికీ పిలుపునిచ్చారు.
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేతను ఒలింపిక్స్‌లో భారతదేశానికి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిన ఏకైక క్రీడాకారుడు అభినవ్ బింద్రా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)