You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రకాశం జిల్లాలో రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం, హింసాత్మక దాడులు
ప్రకాశం జిల్లాలోని రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
చీరాల సమీపంలోని వాడరేవు, కఠారి పాలెం మత్స్య కారుల మధ్య రెండు నెలలుగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. చేపల వేటకు ఉపయోగించే వల విషయంపై రెండు వర్గాల మధ్య వివాదం రేగింది. వాడరేవు మత్స్యకారులు బల్లవల ఉపయోగిస్తుండగా కఠారి పాలెం జాలర్లు ఐలవల వాడాలని వాదిస్తున్నారు. బల్లవల వల్ల చేపలతోపాటు గుడ్లు కూడా బయటకొచ్చి మత్స్యసంపద నశించిపోతోందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే బల్లవల్ల వాడకానికి ప్రభుత్వ అనుమతి ఉందని, తాము అదే వాడతామని వాడరేవు మత్స్యకారులు అంటున్నారు.
అధికారులు రంగంలోకి దిగి కఠారిపాలెం, వాడరేవు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వాడరేవు గ్రామస్తులు వాటిని బహిష్కరించారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఘర్షణ తీవ్రమైంది.
దీంతో ఇరు వర్గాలవారూ సముద్ర జలాల్లోనే ఘర్షణలకు దిగారు. పడవలు, వలలు ధ్వసం చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో దాదాపు 10 మంది గాయాల పాలయ్యారు.
బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమంచికి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- అర్బన్ ఎకో ఫార్మింగ్: విశాఖలో వీకెండ్స్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)