భారత సైన్యం మీద చైనా మైక్రోవేవ్ ఆయుధాలను ప్రయోగించిందా?
లద్ధాఖ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) మైక్రోవేవ్ ఆయుధాలను ఉపయోగించినట్లు ఆన్‌లైన్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాలను భారత సైన్యం మంగళవారంనాడు తోసి పుచ్చింది.
“తూర్పు లద్ధాఖ్‌లో చైనా మైక్రోవేవ్ ఆయుధాలను ప్రయోగించింది అన్న మీడియా రిపోర్టులు నిరాధారం. అవి ఫేక్‌న్యూస్’’ అని ఇండియన్ ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ఏడీజీపీఐ) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది.
ఈ విషయంలో చైనా వైపు నుంచి జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని రక్షణ నిపుణుడు, ఇండియన్ డిఫెన్స్ రివ్యూ అసోసియేట్ ఎడిటర్ కల్నల్ దాన్‌వీర్ సింగ్ అన్నారు.
అసలింతకీ మైక్రోవేవ్ ఆయుధాలంటే ఏంటి?
మైక్రోవేవ్ ఆయుధాలనే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) అని కూడా అంటారు. ఈ మైక్రోవేవ్‌లు విద్యుదయస్కాంత వికిరణ రూపాలు. వాటి వేవ్‌లెంగ్త్ (తరంగదైర్ఘ్యం) ఒక మి.మీ నుండి ఒక మీటర్ వరకు మారుతుంది. వాటి ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం) 300 మెగాహెర్జ్ నుంచి 300 గిగాహెర్జ్ మధ్య ఉంటుంది. వీటిని హై-ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీలు అని కూడా అంటారు.
“మన ఇంట్లో మైక్రోవేవ్ అవెన్ పని చేసే తీరుగానే వీటి పని తీరు కూడా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే ఈ తరంగాలు ఆహారం గుండా వెళతాయి. ఈ ఆయుధాలు కూడా అదే సూత్రంపై పని చేస్తాయి” దాన్‌వీర్ సింగ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులకు పన్నెండేళ్లు... హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు శిక్షిస్తోంది?
- పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలుతుందా?
- ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: సరిహద్దు రేఖను పొరపాటున దాటినా... వెనక్కి రావడం కష్టమే
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)