ఇండియా లాక్‌డౌన్: వలస కార్మికుడికి తన బూట్లు ఇచ్చేసిన రిపోర్టర్

బీబీసీ రిపోర్టర్ సల్మాన్ రావి తన విధుల్లో భాగంగా వలస కార్మికుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా, ఒక రోజు జాతీయ రహదారిపై సుమారు 250 కిలోమీటర్లు నడిచి రోడ్డు పక్కన ఉన్న ఒక కుటుంబాన్ని పలకరించారు.

ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక వలస కార్మికుడు తన బిడ్డను ఎత్తుకుని, చెప్పుల్లేకుండా ఉన్నారు.

పాదాలకు ఎలాంటి రక్షణ లేకుండా ఎలా వెళ్తావు అంటే.. ఇంకేం చేయను, తప్పదు అని ఆ వలస కూలీ సమాధానం ఇచ్చారు.

వాళ్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్‌పూర్ జిల్లా వరకూ వెళ్లాల్సి ఉంది.

దీంతో అప్పటికప్పుడు తన కాళ్లకు ఉన్న బూట్లను తీసి అతనికి ఇచ్చేశారు సల్మాన్.

వలస కూలీల దుస్థితిపై పలు కథనాలు రాసిన సల్మాన్ రావి.. ఈ పరిస్థితిపై, ప్రభుత్వ ఏర్పాట్లపై ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)