You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్: "ఖాళీ కడుపుతో ఎన్నో రాత్రులు నిద్రించా"
రాణి రాంపాల్ 2016లో భారత హాకీ జట్టు కెప్టెన్ అయ్యింది. ఆమె 14 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టులో చోటు సంపాదించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఆమె చాలా కష్టాలు పడింది.
రాణి సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు 2017లో ఆసియా కప్ గెలుచుకుంది. 2018 హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతోంది.
ఈ స్థాయికి వచ్చేందుకు రాణి ఎన్ని కష్టాలు ఎదుర్కొందో ఆమె మాటల్లోనే...
మాది హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా. ఏడేళ్ల వయసు నుంచే హాకీ ఆడటం మొదలుపెట్టాను. 20 ఏళ్ల క్రితం హరియాణాలో పరిస్థితులు బాలికలకు అనుకూలంగా ఉండేవి కాదు. నాలుగు గోడల మధ్యే ఉండిపోవాల్సి వచ్చేది. వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు సమాజం ఏమాత్రం సహకరించేది కాదు.
క్రీడల్లో అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, మా అమ్మానాన్నలు కూడా భయపడేవారు. ఎందుకంటే, వాళ్లు విద్యావంతులు కాదు.
మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మా నాన్న చక్రాల బండి లాగేవారు. కుటుంబ పోషణకు ఆయన చాలా కష్టపడేవారు.
ఎన్నోరోజులు బతిమాలిన తర్వాత నన్ను ఆటలకు పంపేందుకు మావాళ్లు ఒప్పుకున్నారు. ఇప్పుడు నన్ను చూసి అందరికన్నా ఎక్కువగా గర్వపడేది వాళ్లే.
అప్పట్లో మేం పూరి గుడిసెలో ఉండేవాళ్లం. వానాకాలంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. కొన్నిసార్లు కనీసం పూట గడుస్తుందో లేదోనని ఆందోళన పడేవాళ్లం. ఖాళీ కడుపుతోనే ఎన్నో రాత్రులు నిద్రపోయాం.
రోజూ కనీసం అర లీటరు పాలు తాగాలని అకాడమీలో మాకు చెప్పేవారు. నేను గ్లాసు పాలలో, ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి తాగేదాన్ని. మా పరిస్థితి అలా ఉండేది.
2011లో నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబానికి అండగా ఉండేందుకు అవకాశం దొరికింది.
మేరీ కోమ్ నా అభిమాన క్రీడాకారిణి. నలుగురు పిల్లలకు తల్లి అయినా ఆమె ఎన్నడూ ఆటను ఆపలేదు.
ప్రతి అథ్లెట్‌కూ ఒలింపిక్స్‌లో తమ దేశం తరఫున ఆడాలన్న కల ఉంటుంది. మేం కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
వచ్చే ఒలింపిక్స్‌లో 130 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహించబోతున్నాం. కాబట్టి, వాళ్లంతా గర్వపడేలా చేయాలన్నది మా లక్ష్యం.
ఇవి కూడా చదవండి:
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడు
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)