You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘సౌదీకి పోయి మా నాయన పిచ్చోడైనాడు’
ఎండాకాలం.. దట్టమైన ఎండ అన్నివైపులా పరుచుకుంది. ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా ఇళ్లకు తాళాలు వేశారు. ఆ ఊళ్లో నాలుగైదు వీధులకు మించి లేవు. మనుషులు పలుచగా కనిపిస్తున్నారు. అది ఊరులా లేదు. ఒక్కో ఇంటిని దాటుకుంటూ నడుస్తున్నాం.
ఎదురుగా ఓ నడివయసు వ్యక్తి.. ఇంటి బయట గోడ కింద కూర్చున్నాడు ఆకాశంలోకి ఎటో చూస్తూ. నిర్లిప్తంగా ఉన్నాయ్ అతడి చూపులు. ఆయన్ను మాకు చూపిస్తూ..
''అదిగో.. అయప్పే సార్ రామ్మోహన్ అంటే! నేను చెప్పినానే.. సౌదీకి పోయి పిచ్చోడై వచ్చినాడని..!'' అన్నారు రమణమ్మ.
మేం రామ్మోహన్‌ను పలకరించగానే, అతడి కూతురు గౌతమి ఇంటి నుంచి బయటకొచ్చింది.
''మా నాయన మాట్లాడడు సార్'' అంది గౌతమి.
''వద్దు అన్నా ఇనకుండా మా నాయన దమ్మామ్ పోయినాడు సార్. మాకు భూముల్లేవు. అప్పులున్నాయి. అక్కడికి పోకముందు మా నాయన బాగుండె సార్. అక్కడకు పోయినంకే ఇట్లయిపాయ'' అంది గౌతమి.
ఇది రాయలసీమ కథ. రాయలసీమ తండ్రి కథ. మరిన్ని వివరాలకు పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
- ఇందిరా గాంధీ అంత్యక్రియలు ముస్లిం ఆచారాల ప్రకారం చేశారా? : Fact Check
- 'భారత సైన్యాన్ని మోదీ సేన అనేవారు దేశద్రోహులే’ : వీకే సింగ్
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- టీఎన్ శేషన్: దేశ రాజకీయ నేతలే ఆయన బ్రేక్ఫాస్ట్
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్: తిరుగులేని ఆధిపత్యం నుంచి ఉనికి కోసం పోరాడే దశకు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)