తెలంగాణ ఎన్నికలు 2018: దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓటర్లకు చలువ పందిళ్లు

ఎన్నికల కమిషన్ తెలంగాణలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ స్టేషన్‌లకు వచ్చేందుకు వాహన సౌకర్యం కల్పించింది.

తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana/fb

ఫొటో క్యాప్షన్, దూర ప్రాంతాల నుంచి పోలింగ్ బూత్‌కు రాలేని వృద్దుల కోసం ఎన్నికల సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌కు వృద్దులను వీల్ చైర్లలలో తీసుకెళ్లి ఓటు వేయిస్తోంది
తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana/fb

ఫొటో క్యాప్షన్, సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఎన్నికల సంఘం చలువ పందిళ్లను ఏర్పాటు చేసింది
తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana/fb

ఫొటో క్యాప్షన్, సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ ఇది. ఓటు వినియోగించుకునేవరకు కూర్చొని నిరీక్షించేలా ఇలా ఏర్పాట్లు చేసింది
తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana/fb

ఫొటో క్యాప్షన్, వనపర్తి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సిబ్బంది బెలూన్లతో అలంకరించారు. ఓటేయడానికి వచ్చేవారు కూర్చోడానికి వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు
తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana/fb

ఫొటో క్యాప్షన్, పోలింగ్ బూత్‌కు నడిచి వెళ్లలేని వృద్ధుల కోసం ఎన్నికల సంఘం ఉచితంగా వాహన సదుపాయాన్ని కల్పించింది. ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలిని ఎన్నికల సంఘం ఇలా ఆటోలో తీసుకెళ్లింది
తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Suryaprakash

ఫొటో క్యాప్షన్, జనగామ జిల్లా ఫతేషాపూర్ గ్రామంలో వృద్ధుల కోసం ఎన్నికల సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వృద్ధులను ఆటోలో తీసుకొచ్చి వీల్ చైర్‌లో పోలింగ్ బూత్ లోపల వరకు తీసుకెళ్లి ఓటు వేయిస్తుంది
తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana/fb

ఫొటో క్యాప్షన్, ఓటు వేసిన వారికి గులాబీ పువ్వు ఇచ్చి శుభాకాంక్షలు చెపుతున్నారు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎన్నికల సిబ్బంది