భారతీయ అగ్నిమాపక విభాగంలో మొదటి మహిళా ఫైర్ ఫైటర్ ఈమే
ఆమె తన బరువు కన్నా రెండింతలను సునాయాసంగా మోసుకుంటూ నిచ్చెనను ఎక్కగలరు.. దిగగలరు. బరువైన నీటి పైపులను ఉపయోగిస్తూ ఎంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగినా క్షణాల్లో వాటిని ఆర్పేయగలరు. అలాగని ఇదేదో సూపర్ హీరో సినిమా కథ కాదు.
ఇది భారతీయ అగ్నిమాపక విభాగంలో మొదటి మహిళా సిబ్బందిగా బాధ్యతలు స్వీకరించిన తాన్యా సన్యాల్ జీవితం. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్ట్ ఫైర్ అండ్ ఎమర్జన్సీ సర్వీస్ విభాగంలో పని చేస్తున్న తాన్యా పై బీబీసీ ప్రతినిధి కమలేశ్ అందిస్తున్న కథనం.. ఆమె మాటల్లోనే..
‘‘ఎక్కడైనా ఎదైనా జరగ రానిది జరిగితే... జనాలు అక్కడ నుంచి పారిపోతారు. అదే మేం మాత్రం ప్రమాదం జరిగిన చోటుకు పరిగెడతాం.’’

రోజువారీ పని ఎలా ఉంటుంది?
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తా. 6 గంటల నుంచి మొదలయ్యే శిక్షణ కోసం సిద్ధమవుతా. జాగింగ్ తో మొదలై ఆపై వ్యాయామంతో మొదలెడతా. ఆ తర్వాత స్కౌట్ డ్రిల్, పేరెడ్‌కు సిద్ధమవుతా. ఆ డ్రిల్ పూర్తయిన తర్వాత... పెద్ద పెద్ద నీటి పంపులను, నిచ్చెనలను ఉపయోగించే విధానాలపై శిక్షణ మొదలవుతుంది. ఇది చెయ్యొచ్చు.. అది చెయ్యకూడదు అని లేదు. ప్రతి అవసరం మనల్ని మనం నిరూపించుకునేందుకు వచ్చే అవకాశమే.
ఈ ఉద్యోగం గురించి మీ తల్లిదండ్రులు ఏమన్నారు?
నేను దీని గురించి నేర్చుకున్న వెంటనే మా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు చాలా సంతోషించారు. నేను చేస్తున్నది మీరు గర్వపడే పని అని వాళ్లకు చెప్పాను. ఈ విభాగంలో మరింత మంది మహిళలు చేరాలన్నదే నా ఆశ.
ఇవి కూడా చదవండి
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- ఇది మహిళల బ్యాండు మేళం
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- 'పిల్లల్ని కనని మహిళలు ప్రభుత్వానికి భారం': జపాన్ ఎంపీ
- కన్యత్వ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరక కనిపించాలన్నారు. మేం ఎదిరించాం’’
- లవ్ బ్యాంక్: ప్రేమ లేఖ నుంచి సినిమా టికెట్ వరకు.. ప్రతీ జ్ఞాపకం పదిలం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)