మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందన్న త్రిపుర సీఎం వ్యాఖ్యలపై ఓ సరదా ప్రయోగం
మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్లు కనిపెట్టారన్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ కుమార్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి.
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో వచ్చిన మాయాబజార్ సినిమాలోని ‘ప్రియదర్శిని’లో శశిరేఖ, అభిమన్యులు ఒకరికొకరు కనిపిస్తారు. ఇప్పుడున్న వీడియోకాల్‌లో లాగా విరహగీతం కూడా ఆలపిస్తారు.
అయితే.. ఆ ప్రియదర్శినిపై చాలా కాలం క్రితమే ప్రజలు చతుర్లాడారు. మళ్లీ త్రిపుర ముఖ్యమంత్రి చేసిన కామెంట్లపై జోకులు పేలుతున్న సందర్భంలో, బీబీసీ చేసిన ఓ హాస్య ప్రయోగం చూడండి!
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)