#BBCShe విశాఖ: పుష్పవతి అయితే అంత ఆర్భాటం అవసరమా?
పుష్పవతి అయినప్పుడు జరిగే ఉత్సవం వాళ్లను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన బీబీసీ షి పాప్‌అప్‌లో యువతులు మనసువిప్పి మాట్లాడారు.
"అమ్మాయిలు పెద్ద మనిషి కావడాన్ని అంత ఉత్సవంలా చేసి, నెలసరిని మాత్రం ఏదో తప్పులా చూడటం ఏంటో విడ్డూరం" అని అన్నారు ఏయూలో చదువుకుంటోన్న ఒక యువతి.
"నేను దీని గురించి అడిగితే అమ్మాయికి మంచి సంబంధం రావడానికి, అందరికీ తెలిసేలా ఘనంగా చేయడం అని చెప్పారు. ఆమెలాగే చాలా మంది తాము పెద్దమనిషి అయినప్పటి కార్యక్రమాలు తమపై ఎటువంటి ప్రభావం చూపాయో చెప్పుకొచ్చారు.
పుష్పవతి అయినప్పుడు ఒంటరిగా కూర్చోబెట్టడం, స్నానం చేయనివ్వకపోవడం గురించి రకరకాల సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన భిన్న వయసు మహిళలను అడిగినప్పుడు అందరూ ఆ ఆచారాన్ని ముక్తకంఠంతో తప్పుబట్టారు.
షూట్/ఎడిట్: నవీన్ కుమార్
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)